విజయసాయి రెడ్డి గారు మీకు సిగ్గుందా..?

praveen

టిడిపి నేత వెంకన్న ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతు  ఘాటు విమర్శలు చేస్తాడన్న విషయం తెలిసిందే. ప్రతి విషయంలో వైసీపీ ని టార్గెట్ చేస్తూ తనదైన  స్టైల్లో తీవ్ర  విమర్శలు గుప్పిస్తూ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఉంటారు టిడిపి నేత బుద్ధ వెంకన్న. ఇక తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు బుద్ధ వెంకన్న. వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు విజయ సాయి రెడ్డిని టార్గెట్ చేస్తూ ఘాటు విమర్శలు చేశారు.కాగా నీతి అయోగ్ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో  ప్రజా సంక్షేమం వారి సమస్యల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడవ స్థానం దక్కిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమం కోసం వారి సమస్యల పరిష్కారం కోసం పని చేస్తోంది అంటూ ట్విట్టర్ వేదికగా తెలిపారు. 

 

 

అయితే దీనిపై తాజాగా ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి ఆరు నెలల పాలన అద్భుతంగా ఉందని నీతి అయోగ్ ర్యాంక్ ఇచ్చిందా  లేక మీ సంక్షేమ కార్యక్రమాలు చూసి ఆశ్చర్యపోయిందా అంటూ  విమర్శలు గుప్పించారు బుద్ధ వెంకన్న. నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా విజయసాయి రెడ్డి గారు అంటూ ఘాటు విమర్శలు చేశారు బుద్ధా వెంకన్న. 

 

 

 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనుక ఒకవేళ మంచి పరిపాలన అందించి ఉంటే... దానికి గాను అవార్డులు తీసుకొని ఉంటే నేను కూడా అభినందించే వాడిని అని టిడిపి నేత బుద్ధ వెంకన్న తీవ్రస్థాయిలో  విమర్శలు గుప్పించారు. 2015 19 వరకు చంద్రబాబు హయాంలో వివిధ శాఖల ద్వారా జరిగిన అభివృద్ధిని గుర్తించే నీతి ఆయోగ్  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడవ ర్యాంకును ఇచ్చిందని. నీతి అయోగ్ ఇచ్చిన ర్యాంక్ ను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరు నెలల పాలనలో కష్టపడి సాధించినట్టుగా వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇస్తున్న బిల్డప్ చూస్తుంటే మీ పరిస్థితి ఏంటో అర్థం అవుతుంది అంటూ ఎద్దేవా చేశారు టిడిపి నేత బుద్ధ వెంకన్న.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: