షాకింగ్ న్యూస్... కర్నూలులో కన్న కూతురిని రేప్ చేసిన తండ్రి.. !

Reddy P Rajasekhar

ఆడవారిపై అత్యాచారాలు జరుగుతున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో దిశ ఘటన మరవకముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్త చట్టాలు అమలులోకి తెస్తున్నా నేరాల సంఖ్య ఏ మాత్రం తగ్గటం లేదు. దారుణం ఏమిటంటే సొంత ఇంట్లో కూడా ఒక ఆడపిల్లకు రక్షణ కరువైంది. కామాంధుడైన కన్నతండ్రి కన్న కూతురిపైనే అత్యాచారాం చేశాడు 
 
ఆఖరికి ఆడపిల్లకు సొంత ఇంట్లో కూడా రక్షణ లేదా...? అనే సందేహం ఇలాంటి దుర్మార్గులను చూస్తే కలుగుతుంది. కామంతో ఇంకా పదవ తరగతి కూడా పూర్తి కాని తన సొంత కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఒళ్లు తెలియకుండా సొంత కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాలలోకి వెళితే రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు జిల్లాలో భార్య, భర్త, కొడుకు, కూతురు ఉండేవారు. 
 
భర్య మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవటంతో భార్య కష్టపడి పని చేసి కుటుంబాన్ని పోషించేది. మద్యానికి బానిసైన బాలిక తండ్రి బాలికతో అప్పుడప్పుడూ ప్రవర్తించేవాడు. ఈ విషయం బాలిక తల్లికి తెలిసింది. బాలిక తల్లి కూతురిని కాపాడుకుంటూ వచ్చేది. కొన్ని రోజుల క్రితం భార్య పని మీద బయటకు వెళ్లిన సమయంలో కొడుకుకు వేరే పని చెప్పి బాలిక తండ్రి కూత్రురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఆ తరువాత కూతురిని ఈ విషయాన్ని తల్లికి చెప్పవద్దని తల్లికి చెబితే మాత్రం చంపేస్తానని చెప్పాడు. బాలిక కడుపునొప్పితో బాధ పడుతూ ఉండటంతో విచారించిన తల్లికి విషయం అర్థమైంది. విషయం తెలిసిన బాలిక తల్లి బంధువుల సహాయంతో కర్నూలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని బాలిక తండ్రిని అదుపులోకి విచారిస్తున్నారు. సమాజంలో ఉన్న ఇలాంటి ఇలాంటి మృగాలకు కఠిన శిక్ష విధించాలని స్థానికులు కోరుతున్నారు. ఇలాంటి నిందితులకు కఠిన శిక్షలు అమలు చేస్తే మాత్రమే నేరాల సంఖ్య తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: