జిఎన్ రావు ఏమైనా పోటుగాడా..?

praveen

ఆంధ్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఓకే  టాపిక్ హాట్ టాపిక్ గా ఉంది అదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 3 రాజధానిల నిర్ణయం. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని దీని కోసం రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పడే అవకాశం ఉందని దీనివల్ల అభివృద్ధి ఒకేచోట ఆగిపోకుండా రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుందనే  ఉద్దేశంతోనే ప్రభుత్వం మూడు రాజధానిల  ప్రకటన చేస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రకటన చేసినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారమే రేపుతోంది. ప్రతిపక్ష పార్టీలన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. 

 అంతేకాకుండా అమరావతిలో ఆందోళనలు తీవ్రతరం అవుతున్నాయి. రోజురోజుకు ధర్నాలు దీక్షలతో అమరావతి మొత్తం భగ్గుమంటుంది. అమరావతి రైతుల ధర్నా జగన్ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయంపై సిపిఐ అగ్రనేత నారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడంతో జగన్ యూటర్న్ తీసుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు సిపిఐ నేత నారాయణ. ఏపీలో ప్రస్తుతం విధ్వంసకర పాలన సాగుతోందని... మూడు రాజధానులు అంటూ వైసీపీ ప్రభుత్వం కొత్త వివాదాన్ని సృష్టించిందని  ఆయన విమర్శించారు. 

 జిఎన్  రావు ఏమైనా పోటుగాడా ఆయన గురించి అందరికీ తెలుసు అంటూ సీపీఐ నేత నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు. ప్రభుత్వం రాజధాని అధ్యయనం కోసం నియమించిన కమిటీ లన్నీ కాలయాపనకే తప్ప ఆ కమిటీ ఇచ్చిన నివేదికలు  నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావు అంటూ ఎద్దేవా చేశారు. రాజధాని అధ్యయనం కోసం ఎన్ని కమిటీలు నియమించిన ఆ కమిటీల నివేదికలు జగన్ చెప్పినట్లే ఉంటాయని ఎద్దేవా చేశారు నారాయణ. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తూ ఏపీ  ప్రభుత్వం.. అలా జరిగితే ఎందుకు నిరూపించలేక పోయారు  అంటూ మంత్రివర్గాన్ని నిలదీస్తారు. విశాఖ భూ కుంభకోణంలో వైసిపి టిడిపి కాంగ్రెస్ నేతలు ఉన్నారని ఆరోపించారు. గంటా,  ధర్మాన కుటుంబ సభ్యులకు ఇందులో ప్రమేయం ఉందంటూ ఆయన ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: