ఏనాడు నేల విడిచి సాము చేయలేదు : కేటీఆర్

Reddy P Rajasekhar

టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం తరువాత కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కరెంట్ విషయంలో, మంచినీటి విషయంలో చెప్పింది చేసి చూపెట్టామని అన్నారు. అభివృద్ధి ఫలాలు ఈరోజు అందరికీ కనిపిస్తున్నాయని కేటీఆర్ అన్నారు. కొత్త మున్సిపల్ చట్టం కొన్నిరోజుల క్రితమే వచ్చిందని పట్టణాలను బాగు చేసుకునే క్రమంలో ముందుకు పోతున్నామని చెప్పారు. రాష్ట్రం బాగుండాలంటే పల్లెలు, పట్టణాలు బాగుండాలని పల్లెలు ఇప్పటికే ప్రగతిబాట పట్టాయని పట్టణాలు ప్రగతిబాట పడతాయనే విశ్వాసం తనకు ఉందని చెప్పారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణమైన బలంతో శాసనసభలో, శాసనమండలిలో కేసీఆర్ నాయకత్వంపై అపారమైన విశ్వాసంతో సంపూర్ణమైన మెజారిటీని మాకు కట్టబెట్టారని కేటీఆర్ అన్నారు. 60 లక్షల మంది సభ్యులతో పార్టీ మంచి శక్తిగాఎదిగిందని అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంత పెద్ద ఎత్తున నిధులు ప్రతి మున్సిపాలిటీకి కేటాయించామని కేటీఆర్ అన్నారు. ఏ నాడు నేల విఢిచి సాము చేయలేదని కేటీఆర్ అన్నారు. 

తమ, పర భేదం లేకుండా నిధులు మంజూరు చేశామని కేటీఆర్ అన్నారు కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలే ఎజెండాగా ముందుకు పోతామని కేటీయార్ అన్నారు. 200 రూపాయల పెన్షన్ అందుకునేవారు ఇప్పుడు 2000 రూపాయల పెన్షన్ అందుకుంటున్నారని పెన్షన్ దాదాపు పది రెట్లు పెన్షన్ పెరిగిందని కేటీఆర్ అన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలతో సంక్షేమం, అభివృద్ధి జరిగిందని అన్నారు. 
 
ప్రభుత్వ పని తీరే మాకు పెద్ద బలం అని కేటీఆర్ అన్నారు. మనం చేసిన పనిని, చేయబోయే పనిని ప్రజలకు చెబుదామని కేటీఆర్ అన్నారు. గడచిన సంవత్సర కాలంగా టీఆర్ఎస్ ఏ రకమైన ఫలితాలు పొందిందో అదే విధంగా అదే విధంగా ఫలితాలను పొందుతుందని అన్నారు. పంచాయతీలు, మున్సిపల్ చట్టాలను తీసుకొచ్చామని కేటీఆర్ అన్నారు. ప్రజలు ఏ ఎలక్షన్ వచ్చినా ఆశీర్వాదం ఇచ్చారని కేటీఆర్ అన్నారు. ఎన్ని సీట్లలో గెలుస్తామని నెంబర్ చెప్పే అలవాటు లేదని కేటీఆర్ అన్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: