ఈ టీ పొడి ధర 40 వేలు.. ప్రత్యేకత ఏమిటంటే.?

praveen

ఈ రోజుల్లో టీ కాఫీలు తాగడం రోజురోజుకు ఎక్కువవుతోంది. ఏదైనా హ్యాపీనెస్ వచ్చిన  టీ తాగడం.. లేకపోతే ఏదైనా టెన్షన్ లో  ఉన్న టీ తాగడం...ఇలా  ప్రతి విషయంలో టీ  ఒక భాగమైపోయింది. అయితే టీ కి బాగా ఎడిక్ట్  అయిపోయి ఉంటారు చాలా మంది . ఫుడ్ తీసుకోకపోయినా ఉంటారు కానీ టీ తాగకుండా మాత్రం అస్సలు ఉండలేరు. అయితే టీ తయారు చేయడానికి మార్కెట్లు వివిధ రకాల పేర్లతో టీ పొడిలు  ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే టీ తయారు చేసే టీ పొడి ధర ఎంత ఉంటుంది...హా  ఎంత ఉంటుందిలేండి..  తక్కువే ఉంటుంది అంటారా. అలా అనుకుంటే మాత్రం పొరబాటే... ఇక్కడ కిలో టీ పొడి ధర 40 వేల రూపాయలు. టీ పొడి ధర చెప్పగానే నోరెళ్ళబెట్టి ఆశ్చర్య పోయారు కదా. నేను చెప్పేది నిజమే నండి. 

 

 

 

 అయితే ఇది ఎక్కడో పొరుగు దేశాల్లో కాదు మన దేశంలోనే. ఇంతకీ టీ పొడి కి ఎందుకు అంత ధర ఎందుకు...  దీని ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే. చెన్నైలోని ఓ ప్రాంతంలో కిలో టీపొడి ధర 40 వేల రూపాయలు పలికి  అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. దక్షిణ భారత టీ  బోర్డు ఆధ్వర్యంలో  నీలగిరి జిల్లా కాన్పూర్లో నిర్వహించిన..  తేయాకు ప్రదర్శనల్లో..అక్కడ ఓ  టీ పొడి కి 40 వేల రూపాయలు ధర  పలికింది. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఈ టీ పొడి అలాంటి ఇలాంటి టీ పొడి కాదండోయ్.. ఆర్గానిక్ పద్ధతిలో పండించిన టీ పొడి ఇది. అందుకే దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. 

 

 

 

 అయితే ఆర్గానిక్ పద్ధతిలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని పండించిన టీ పొడిని 'భూ ఎర్' అని పిలుస్తూ ఉంటారు. అయితే ఆర్గానిక్ టీ పొడి  50 గ్రాములు ఏకంగా రెండు వేల రూపాయలు పలుకుతోంది. కిలో ఏజ్  టీ పొడి  40 వేల రూపాయలు పలుకుతోంది. ప్రాకృతిక విధానంలో ఆక్సిజన్ ఎక్కువగా ఉపయోగించి పండించిన ఈ రెండు రకాల టీ పౌడర్లు ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిర్వాహకులు తెలిపారు. అయితే అంతా బాగానే ఉంది కానీ.. కిలో టీ పొడి 40 వేల రూపాయలు అంటే టీ తాగే వాళ్ళు కూడా మానేసుకుంటారేమో కదా. ఎందుకంటే బయట దొరికే సాదాసీదా టీ లు  తాగడానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు కానీ... ఇలాంటి ఆర్గానిక్ టీ తాగడానికి ఇష్టం ఉన్న  టీ కోసం ఇంత ధర వెచ్చించడానికి జనాలు కాస్త ఆలోచిస్తారు కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: