గట్టి భద్రతల నడుమ నేడే ఢిల్లీలో ప్రధాని సభ...!

Suma Kallamadi

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో కొన్ని వర్గాల్లో ఆందోళన జరుగుతున్నాయి. దీనితో గత పది రోజులుగా హింసాత్మక సంఘటనలు కూడ చేసుకోవడంతో సుమారు 20 మంది జనం కూడ మృత్యువాతపడిన పరిస్థితి నెలకొంది దేశంలో. దీనితో ఓవైపు నిరసనలు మిన్నంటుతుంటే, మరోవైపు దేశ ప్రధాని నరేంద్రమోడీ మెగా పోలిటికల్ ర్యాలీ చేయబోతున్నారు. ఆదివారం మధ్యహ్నం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగే భారీ ప్రదర్శన, బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

అయితే ఇది ఇలా ఉంటే మోడీ ర్యాలీకి బెదిరింపులు వచ్చాయి. అల్లర్లు చెలరేగే అవకాశం ఉండడంతో ప్రధాని ర్యాలీ పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు అక్కడ. రామ్‌ లీలా మైదానం పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమై ఏర్పాట్లను చేశారు. మోడీ ర్యాలీతో పాటు ఇతర ప్రాంతాలను పోలీసుల ఆధీనంలోకి పూర్తిగా తీసుకున్నారు. దీనితో ఆ ప్రాంతాన్ని నో ఫ్లై జోన్‌ గా ప్రకటించారు. అందోళనలకారులు ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేయవచ్చన్న నిఘావర్గాల హెచ్చరికలతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మైదానం చుట్టు ఐదు వేల పోలీసులు ఇప్పటికే ర్యాలీ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆదీనంలోకి టిస్యూకున్నారు. పోలీసులు సుమారు అయిదు వేల మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇందుకోసం నేషనల్ సెక్యూరిటీకి చెందిన అధికారులను రంగంలోకి దించారు. యాంటీ ఎయిర్ క్రాఫ్ట్, యాంటీ డ్రోన్ బృందాల్ని సైతం వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. వీరితో పాటు మొత్తంగా ఎస్పీజీ, ఢిల్లీ పోలీసులు,ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్‌పీఎఫ్ కలిసి మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 


బహిరంగ స్థలంలో ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరీశీలిస్తున్న పోలీసులు సరైన గుర్తింపు కార్డు ఉన్నవారినే సభ ప్రాంగణంలోకి వచ్చే విధంగా చూస్తున్నారు. మెటల్‌ డిటెక్టర్ల ద్వార నాయకులు, ప్రజలను లోనికి అనుమతిస్తున్నారు. రామ్‌ లీలా పరిసర ప్రాంతాల్లోని దుకాణాలను సభ పూర్తయ్యే వరకు అక్కడ మూసివేయనున్నారు. నగరంలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఇంకా కొనసాగనున్నాయి.  ముఖ్యంగా మరికొన్ని రోజుల్లో ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్నాయి. దీనితో ఇప్పటికే ప్రస్తుతం సీఎం కేజ్రీవాల్ ప్రజాకర్షక పథకాలు కూడా ప్రవేశపెట్టారు. దీనితో దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జెండా ఎగరవేసేందుకు పార్టీ నాయకత్వం పావులు జరుపుతుంది. దీనితో మెగార్యాలికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ సంధర్భంలోనే పౌరసత్వ చట్టం మోడీ ప్రభుత్వానికి కొంత వ్యతిరేకంగా మారిన పరిస్థితి  వారికి కనిపిస్తోంది. దీనితో పౌరసత్త చట్టంతోపాటు పలు అంశాలపై మోడీ ఎలాంటీ ప్రకటన చేయబోనున్నారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: