*జగన్ అంటేనే జనం అంటేనే జగన్ ! *
2019 ఎన్నికల్లో జగన్ 151 ఎమ్మెల్యే సీట్లతో వైసీపీ పార్టీని గెలిపించి ఘన విజయం సాధించారు. చరిత్రలో కనీ వినీ ఎరుగని మెజారిటీని సాధించి జగన్ అంటే జనం జనం అంటేనే జగన్ అనేలా ప్రభంజనం సృష్టించారు. నిజానికి 2014 ఎన్నికల సమయంలోనే జగన్ ముఖ్యమంత్రిగా గెలవాలి. కానీ తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేయటంతో జగన్ 67 స్థానాలకు పరిమితమయ్యారు.
కానీ 2014 ఎన్నికల్లో వైసీపీ పార్టీకి పొత్తులతో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీకి మధ్య వ్యత్యాసం కేవలం 5 లక్షల ఓట్లు మాత్రమే కావడం గమనార్హం. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. జగన్ పాదయాత్ర సమయంలో జగన్ ప్రజలు పడుతున్న కష్టాలను కళ్లారా చూసి ప్రజా సంక్షేమ పాలన అందించే లక్ష్యంతో మేనిఫెస్టోను తయారు చేశారు.
జగన్ కుల, మత, ప్రాంతీయ బేధాలు లేకుండా మేనిఫెస్టోను రూపొందించి మేనిఫెస్టోలోని నవరత్నాల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారు. చంద్రబాబు అవినీతి పాలనతో విసుగెత్తిన ఏపీ ప్రజలు జగన్ ను రికార్డు స్థాయి అసెంబ్లీ సీట్లతో గెలిపించగా జగన్ గెలిచిన రోజు నుండి నవరత్నాలలోని హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. ఏపీ ప్రజలలో జగన్ పరిపాలనపై పూర్తి స్థాయి సంతృప్తి వ్యక్తమవుతోంది.
సీనియర్ ఎన్టీయార్, వైయస్సార్ తరువాత ఆ స్థాయిలో ప్రజా సంక్షేమ పాలన జగన్ మాత్రమే అందిస్తున్నారని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ పై తమకు ఉన్న అభిమానాన్ని జనం 2019 ఎన్నికల్లో ఓట్ల రూపంలో చూపించారు. ప్రజా సంక్షేమ పాలన దిశగా అడుగులు వేస్తున్న జగన్ పాలనపై అన్ని వర్గాల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమైందని ప్రజలందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు..