జగన్ : ధ్యేయం గట్టిదైతే మార్గం సుగమం కిదే నిదర్శనం !

praveen

కష్టేఫలి అనేది ఒక నానుడి... కష్టపడితే ఫలితం తప్పకుండా దక్కుతుంది అని అంటారు. ఇప్పటి కాలంలో కష్టేఫలి అనే నానుడికి నిదర్శనం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తండ్రి వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత... ఆయన ఆశయాలను ఎజెండాను నిలబెట్టడం కోసం తనయుడిగా బాధ్యతలు స్వీకరించారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా... వెనుకడుగు వేయకుండా ముందుకు నడిచారు  జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి... ప్రజలకు సుపరిపాలన అందించడమే ధ్యేయంగా ముందుకు సాగారు. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడే ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి వేల కిలోమీటర్లు రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి ప్రజల మనిషిగా పేరుతెచ్చుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల్లో 150 సీట్ల భారీ మెజారిటీ ని సొంతం చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 

 

 

 

 ద్యేయం  గట్టిదైతే  మార్గం సుగమం అవుతుంది అనడానికి ఉదాహరణ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి వారసుని గా.. ప్రజలకు సుపరిపాలన అందించడమే ధ్యేయంగా ముందుకు సాగారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారు  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దృఢ సంకల్పంతో పట్టుదలతో ముఖ్యమంత్రి కావాలనుకున్న జగన్మోహన్ రెడ్డి... ఒకటే ద్యేయం  తో పట్టువీడని విక్రమార్కుడులా ముందుకు సాగి  ఇప్పుడు ముఖ్యమంత్రి గా మారిపోయారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అందరికీ చాటి చెప్పారు. 

 

 

 

 ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటికీ అదే ద్యేయంతో  ఇప్పటికీ ముందుకు సాగుతున్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి  ప్రజలకు ఎలాంటి పాలన అందించాలి అని అనుకున్నారో  ఇప్పుడు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అంతకుమించిన సుపరిపాలన అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ పాలనను గాడిలో పెట్టి... అసలు పాలన అంటే ఇలా ఉంటుంది అని నిరూపిస్తున్నారు ఆయన. జగన్ అధికారంలోకి వస్తే రాజన్న  పాలన వస్తుందని నమ్మిన ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ అంతకు మించిన పాలననే అందిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సంకల్పం పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే  నానుడి వినడమే తప్ప అలా సాధించిన వ్యక్తులను కొంత మందినె  చూస్తూ ఉంటాం... ఇప్పటి జనరేషన్లో ఈ నానుడి కి ఉదాహరణ ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాత్రమే. అందుకే తెలుగు ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డికి  సలాం కోడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: