
ఢిల్లీలో భూప్రకంపనలు... వణికిన ఉత్తర భారతదేశం ....!
ఉత్తర భారతదేశంలో భూప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. ఢిల్లీ సహా ఢిల్లీ పరిసర ప్రాంతాలలో భూప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.8గా నమోదు అయింది. భూ ప్రకంపనలతో ఉత్తర భారతదేశం మరోసారి ఊగిపోయింది. హిందూకుష్ పర్వత శ్రేణుల్లో భూకంప కేంద్రం ఉండటంతో భూకంపం ప్రభావం భారత్ పై తక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది.
ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం సంభవించటంతో భారత్ లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలలో భూప్రకంపనలు ప్రజలను వణికించాయి. ఈరోజు సాయంత్రం 5.13 గంటలకు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. ఉత్తరాఖాండ్, జమ్మూ కశ్మీర్, హర్యానా, పంజాబ్ లలో కూడా భూప్రకంపనలు నమోదయ్యాయి.
భూకంపం ప్రభావంతో ఆఫ్ఘనిస్తాన్ లో భారీ నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. ఢిల్లీ నుండి కశ్మీర్ వరకు పలు ప్రాంతాలలో భూమి కంపించింది. ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. నెల రోజుల క్రితం కూడా ఢిల్లీలో భూప్రకంపనలు సంభవించాయి. హిందూకుష్ రీజియన్ ప్రాంతంలో భూకంపం కేంద్రీకృతమై ఉన్న భూకంపం ప్రభావంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు,
పాకిస్తాన్ లో కూడా స్వల్పంగా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయని సమాచారం. ఉత్తరప్రదేశ్ లోని మధురై, లక్నో, ప్రయాగరాజ్ తో పాటు జమ్మూకశ్మీర్ లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీలో స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకోవటంతో స్థానికులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. పాక్ లోని లాహోర్ ప్రాంతంలో భూప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారని అక్కడి మీడియా వెల్లడించింది. భారత్ లో మాత్రం ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. వరుస భూకంపాలు ఢిల్లీ వాసులను గజగజ వణికిస్తున్నాయి. అధికారులు భారత్ పై భూకంపం ప్రభావం ఎక్కువగా ఉండదని చెప్పటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.