అంబేడ్కర్ కోసం...

హైదరాబాద్ : తెలంగాణ జాగ్రుతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను కలిశారు. అసెంబ్లీ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు సహకరించాలనీ ఆమె ఈ సందర్భంగా విజయమ్మను కోరారు. ఇప్పటికే ఇదే విషయమై కవిత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుణ్ణి కూడా కలిశారు. పార్టీలతో సంబంధం లేకుండా అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు కోసం కవిత గత కొన్ని నెలలుగా పోరాటం సాగిస్తున్నారు. లోటస్‌పాండ్‌లో వైఎస్‌ విజయమ్మను కలిసిన కవిత ఈ నెల17 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించాలనీ కోరారు చేశారు. దీనిపై వైఎస్‌ విజయమ్మ కూడా సానుకూలంగా స్పందించినట్లు వైఎస్ఆర్‌ పార్టీ నేతలు తెలిపారు.  అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టేలా ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ఒత్తిడి తీసుకురావాలని కోరారు. దీనికి స్పందించి బాబు ఈ విషయమై ప్రభుత్వానికి పార్టీ తరపున గతంలోనే లేఖ రాశామని మళ్లీ ఒత్తిడి తీసుకొస్తాననీ బాబు చెప్పారు కూడా. అసెంబ్లీ ఆవరణలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి మొన్నబాబును నేడు వైఎస్ విజయమ్మను కలువడంతోనే కవిత అసలు రాజకీయం బయటపడుతోందనీ అప్పుడే రకరకాలుగా ప్రచారం జోరందుకున్నది . అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు విషయమై టీడీపీ కూడా అనూకలంగా వుంది. అంతేకాదు, టీడీపీ ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే, అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు కోసం కేసీఆర్ కూతురు కవిత చంద్రబాబునాయుణ్ణి , వైఎస్ విజయమ్మను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు టీడీపీ చేసిన ప్రయత్నానికి ఫలితం లేకుండా పోయింది. కొత్తగా పుట్టుకువచ్చిన జాగ్రుతి అంబేద్కర్ విగ్రహాం ఏర్పాటు కోసం విజయమ్మను, బాబును కలవడం కొంత రాజకీయం చేస్తున్నట్లు సర్వత్రా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ఏ పార్టీ కానీ, ఎవరూ వ్యతిరేకించే ప్రసక్తే లేదు. అయినప్పటికీ తెలంగాణ జాగ్రుతి అధ్యక్షురాలు కవిత అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు విషయంలో తమకున్నంత శ్రద్ధ, అభిమానం ఎవరికీ లేదనే విధంగా వ్యవహారించడమే ఇప్పుడు అంతటా వాడి వేడిగా చర్చ సాగుతోంది. ఏమైనా కవిత రాజకీయమే వేరు మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: