ఆ హీరో హీరోయిన్లు ఎందుకు వీడిపోయారంటే..

Suma Kallamadi

సినిమా వాళ్లకు ఉన్న ఇమేజ్ మరెవ్వరికీ ఉండదు. వాళ్లు ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టారంటే అభిమానులు చుట్టుపెట్టేస్తారు. అభిమాన తారల సినిమాలు విడుదలైతే వారికి పండుగే. యువత కాలేజీలకు బంక్ కొట్టి మరీ మూవీలకు వెళ్తారు. అలాగే హీరోయిన్స్​ పరిస్థితి కూడా అంతే. కొందరూ హీరోయిన్లకు అభిమానుల ఫాలోయింగ్​ కూడా బాగానే ఉంటుంది. వారి పుట్టిన రోజు వస్తే చాలు.. అన్నదానాలు, రక్తదానాలు, దుస్తుల పంపిణీ, అనాధ, వృద్ధాశ్రమాల్లో సేవలు, ఆలయాల్లో పూజలు ఇలా తారలు మెచ్చేలా సేవలు చేస్తారు. వారి సినిమాలను ఫాలో అవుతూ.. వారిని అనుకరిస్తారు. మంచిని అనుసరిస్తే బాగానే ఉంటుంది కానీ చెడును స్వీకరిస్తేనే ఎవరికైనా నష్టం తప్పదు. అయితే అభిమానులు ఇంతలా ఇష్టపడే నటీనటుల జీవితాల్లో కూడా కొన్ని చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. హీరోహీరోయిన్లు కేవలం సినిమాల్లోనే కాదు నిజ జీవతంలోనూ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు ఉన్నారు. వారిలో కొందరూ కలిసి ఉండగా మరికొందరూ విడిపోయారు. వారిలో కొందరు టాప్ హీరోలు కూడా ఉన్నారు.  

 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలువురు స్టార్ హీరోలు, హీరోయిన్లు పెళ్లి చేసుకున్నాక తమ తొలి వైవాహిక బంధానికి దూరమై మళ్లీ పెళ్లి చేసుకుని కొత్త వైవాహిక బంధాలను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఎవరెవరు ఈ లిస్టులో ఉన్నారో ఓ లుక్కేద్దాం.


యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున 1984 లో డాక్టర్ డి.రామానాయిడు కుమార్తె లక్ష్మి దగ్గుబాటిని వివాహం చేసుకున్నారు, కాని నాగ్‌ 1990 లో ఆమెకు విడాకులు ఇచ్చారు. నాగ చైతన్య అమ్మ లక్ష్మికి విడాకులు ఇచ్చిన తర్వాతే అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

 

పవర్​ స్టార్​ పవన్ కల్యాణ్, రేణూదేశాయ్‌కు విడాకులు ఇచ్చి మూడో వివాహాం చేసుకున్నారు. అంతకు ముందు తన మొదటి భార్య నందిని విడాకులు ఇచ్చిన తర్వాతే రేణు దేశాయ్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు కూడా విడాకులు ఇచ్చి అన్నా లెజ్నోవాను మూడో వివాహం చేసుకున్నాడు. నటుడు శరత్ బాబు మొదటిసారి నటి రామప్రభును 1981లో వివాహం చేసుకున్నారు. ఈ జంట 1988 సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. ప్రకాష్ రాజ్ 1994 లో నటి లలితా కుమారిని వివాహం చేసుకున్నారు. ఈ జంట 2009 లో విడాకులు తీసుకున్నారు.  2010 లో కొరియోగ్రాఫర్ పోనీ వర్మను ప్రకాష్ రాజ్ వివాహం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: