హైవేలపై ఇలాంటి పనులే చేసేవారా..?

NAGARJUNA NAKKA

దిశ కేసులో రోజుకో రిపోర్ట్ పోలీసులకు చేరుతోంది. నిందితులకు మరికొన్ని కేసుల్లో కూడా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇతర రాష్ట్రాలకు కూడా టీంలను పంపారు. దిశకు మద్యం తాగించి ఆత్యాచారం చేసి.... హత్య చేసినట్లుగా ఫోరెన్సిక్ నివేదికలో బయట పడింది. డీఎన్‌ఏ అధారంగా పోలీసులు ఇంటరాగేషన్ స్పీడప్ చేస్తున్నారు.  


దిశ కేసులో పోలీసులు అన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. దిశపై ఆత్యాచారం, హత్య,  కాల్చి వేత కేసులకు సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సంఘటన స్థలంలో దొరికిన అన్ని ఆధారాలను ఫోరెన్సిక్‌కు పంపించారు పోలీసులు. డీఎన్‌ఏ నివేదికలో కీలక ఆధారాలు లభించాయి. నలుగురు నిందితులు గతంలో చేసిన నేరాలు ....రిపోర్ట్‌లోని అంశాలు మ్యాచ్‌ అవుతున్నాయని ఫోరెన్సిక్‌ నిపుణులు చెబుతున్నారు. హైవేపై గతంలో వీరంతా నేరాలు చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు ఎన్‌కౌంటర్‌ జరిగిన రోజున సీపీ సజ్జనార్‌ తెలిపారు. 

 

దిశ శరీరంలో ఆల్కహాల్‌ను గుర్తించారు ఫోరెన్సిక్‌ నిపుణులు. అత్యాచారం చేయడానికి ముందు ఆమెకు మద్యం పట్టించినట్లు గుర్తించారు. అపాస్మారక స్థితిలోకి వెళ్లాక ఆ నలుగురు పాశావికంగా ఆత్యాచారం చేసి హత్య చేసి కాల్చి వేసినట్లు నిర్థారణకు వచ్చారు. ఇందుకోసం టోల్‌గేట్‌ సమీపంలోని వైన్‌ షాప్‌ దగ్గరే నిందితులు మద్యం కొనుగోలు చేసినట్లు ఆధారాలు సంపాదించారు పోలీసులు. ఆనాడు ఉదయం నుంచి రాత్రి వరకూ నలుగురు నిందితులు లిక్కర్‌ తాగుతూనే ఉన్నట్లు కూడా  తెలుసుకున్నారు.


ఈ కేసులో నలుగురు నిందితుల నేర చరిత్రపైన పోలీసులు దృష్టి పెట్టారు. గతంలో కూడా ఈ నలుగురు దిశ లాంటి ఘటనలకు పాల్పడి ఉంటారన్న కొణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. నాలుగు రాష్ట్రాల్లో మిస్సింగ్ కేసులను ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఆరు రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపారు. హైవేల మీద దిశ మాదిరి జరిగిన కేసులను కూడా వెరిఫై చేస్తున్నారు. స్వగ్రామంలో నిందితులపై  కొన్ని కేసులు కూడా ఉన్నట్టు పోలీసులు తేల్చారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: