ఇంకొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం... ఇంతలో పార్టీని వీడిన కీలక నేత.?

praveen

మహారాష్ట్రలో ఎన్నో మలుపులు తరువాత చివరికి ఈ రోజు శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్సీపీ కాంగ్రెస్ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ఏర్పాటు చేయనున్నారు. కాగా నేడు ఉద్ధవ్ థాక్రే తో పాటు పది మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శివసేన పార్టీ మొదటి నుంచి ఉద్దవ్ థాక్రే సీఎం సీటులో కూర్చోబెట్టాలని పట్టుబడిన విషయం తెలిసిందే. అనుకున్నట్లుగానే ఎన్నో రాజకీయ సమీకరణాల తర్వాత శివసేన పార్టీ తన పంతం నెగ్గించుకుని  ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొన్ని గంటల్లో మహారాష్ట్ర తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే. 

 

 

 

 అయితే ఉద్ధవ్ థాక్రే మరికొన్ని గంటలో మహారాష్ట్ర తరువాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా  ఆ పార్టీకి చెందిన కీలక నేత ఒకరు తప్పుకున్నారు. శివసేన విద్యార్థి విభాగం జాతీయ విద్యార్థి సేన లో కీలకంగా వ్యవహరిస్తున్న రమేష్ సోలంకి... తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ సిద్ధాంతాలను పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి తన మనసు ఒప్పుకోవడం లేదని ఆయన తెలిపారు. అందుకే శివసేన పార్టీ నుంచి తప్పుకుంటున్న అని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు రమేష్ సోలంకి. శివసేన పార్టీ నుంచి తప్పుకోవడం తనను తీవ్రంగా బాధిస్తుందని అయినప్పటికీ... కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి తన మనసు ఒప్పుకోవడం లేదని అన్నారు. తానెప్పుడూ బాలాసాహెబ్ శివ సైనిక్  గానే మిగిలిపోతాను అంటూ రమేష్ సోలంకి స్పష్టం చేశారు. 

 

 

 

 అయితే ఎన్నో ఏళ్లు శివ సైనిక్  పనిచేసి ఇప్పుడు శివసేన నుంచి తప్పుకోవడం తీవ్రంగా బాధిస్తోంది అంటూ రమేష్ సోలంకి ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్ళు శివసేన లో పనిచేసే అవకాశం కల్పించినందుకు పార్టీ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ ఆయన అన్నారు. ఇక  ఈరోజు సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ముంబై దాదర్లోని శివాజీ పార్క్ లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయి. ఉద్ధవ్ థాక్రే ప్రమాణస్వీకారానికి బిజెపి ముఖ్య నేతలను కూడా ఆహ్వానించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: