ఎంత చెప్పినా భార్య ఉద్యోగం మానేయడం లేదని చివరికి భర్త ఏం చేసాడో తెలుసా.?

praveen

భార్య భర్తల అనుబంధం అంటే ఎంతో అన్యోన్యంగా ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం భార్య భర్తల బంధం అంటే అక్రమ సంబంధాలు హత్యలు ఇలా తయారైపోతుంది. చిన్న చిన్న సమస్యలకే భార్య భర్త ప్రాణాలు తీయడం భర్త భార్య ప్రాణాలు తీయడం జరుగుతుంది. ఇలాంటి ఘటనలు రోజుకొకటి  తెర మీదకు వస్తూనే ఉన్నాయి. కొంతమంది క్షణికావేశంలో తమ తమ  భార్య,  భర్తల ప్రాణాలు తీస్తుంటే ఇంకొంతమంది పథకం పన్ని  మరి భార్య భర్తలు ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు. ఇక చివరికి కటకటాలపాలవుతున్నారు . ఇక్కడ ఓ భర్త అదే చేసాడు.  క్షణికావేశంలో భార్యను చంపేసాడు. ఉద్యోగం  మానేయడం లేదని  ప్రాణాలను గాల్లో  కలిపేసాడు ఇక్కడ ఓ భర్త .

 


 పాకిస్తాన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే దిలావర్, ఉరూజ్ ఇక్బల్  భార్యాభర్తలు.  7 నెలల క్రితమే వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరు జర్నలిస్టులు వృత్తిలో కొనసాగుతున్నారు.భార్య ఉరూజ్ ఓ  ఉర్దూ పత్రికలో పని చేస్తుండగా మరో ఉర్దూ  పత్రికలో  భర్త దిలావర్ పని చేస్తున్నాడు. అయితే కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత ఉద్యోగం మానేయాలి  అంటూ ఉరూజ్  భర్త పలుమార్లు కోరాడు. అయితే ఈ విషయంలో చాలా సార్లు వీరిద్దరి మధ్య వాగ్వాదం కూడా జరిగింది. అయినప్పటికీ భార్య ఉరూజ్  ఉద్యోగాన్ని వదలక పోవడం తో... ఉద్యోగం మాని వేయాలంటూ భర్త మరింత ఒత్తిడి పెంచాడు. భర్త ఒత్తిడి తో విసిగి పోయిన ఉరూజ్  అతడి నుంచి దూరంగా ఆఫీస్కి పక్కనే ఓ గదిలో ఉంటుంది.

 


 దీంతో భర్త దిలావర్  మరింత కోపోద్రిక్తుడయ్యాడు . కోపంతో రగిలిపోయిన దిలావర్ తన భార్య పని  చేస్తున్న కార్యలయం లోకి ప్రవేశించి కాల్పులు జరిపాడు. దీంతో రెండు బుల్లెట్స్  భార్య ఉరూజ్  తలలోకి  దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయి  ప్రాణాలు విడిచింది. ఉరూజ్  సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తన సోదరి ఉరూజ్  ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ పెళ్లయినప్పటి నుంచి తన సోదరుని దిలావర్ హింసిస్తూనే ఉన్నాడు అంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సోదరుని ఉద్యోగం  మానేయాలని చాలా ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. అయితే ఇంతకు ముందే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని... చివరికి ఇంత ఘాతుకం  జరిగిపోయింది  అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: