
కేంద్రం సంచలన నిర్ణయం... భారీగా తగ్గనున్న బియ్యం ధరలు
మార్కెట్లో బియ్యం కొనుగోలు చేయాలంటే వాటి ధరను చూసి వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటి కాలంలో బియ్యానికి చాలా డిమాండ్ వచ్చేసింది. నాసిరకం బియ్యం ధరలు కూడా ఆకాశాన్ని అంటుతుండటంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గ్రామాల్లో ఉండే ప్రజలు అక్కడ ఉన్న కాస్తయినా పొలంలో పండిన ధాన్యం తో కాలం వెళ్లదీస్తుంటారు.కానీ నగరాల్లో మాత్రం అవకాశం కూడా లేకపోయింది. దీంతో నగరాల్లో ఉండే ప్రజలు అందరూ తప్పనిసరిగా బియ్యం కొనాల్సిన పరిస్థితి. నాసిరకం బియ్యం ధరలే సామాన్యులకు బెంబేలెత్తిస్తుండగా ఇక మేలు రకం బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.ఈ క్రమంలో దేశ ప్రజలందరికీ కేంద్రం తీపి కబురు చెప్పింది.
అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బియ్యం ధరలు త్వరలో భారీగా తగ్గనున్నాయి . హోల్సేల్ మార్కెట్ లోనే కాదు రిటైల్ మార్కెట్లో కూడా బియ్యం ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత ఆహార సంస్థ వద్ద ఉన్న బియ్యం బఫర్ నిల్వలను తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. భారత ఆహార సంస్థ వద్ద ఉన్న నిల్వలను తగ్గించడం ద్వారా కొత్తగా రాబోయే నిల్వలకు అవకాశం ఏర్పడుతుందని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం భారత ఆహార సంస్థ వద్ద 2.31 కోట్ల టన్నుల బియ్యం నిల్వ ఉన్నాయి. కాగా నిల్వ ఉన్న 2.31 కోట్ల టన్నుల బియ్యం లో... ఒక కోటి టన్నుల బియ్యాన్ని బహిరంగ మార్కెట్ విక్రయ పథకం ద్వారా ఈ వేలంలో మిల్లర్లకు విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఓఎంఎస్ఎస్ ఎఫ్సిఐ బియ్యం ధర క్వింటాలుకు 2,785 రూపాయలుగా ఉంది. కాగా ఈ ధరను 2,250 రూపాయలకు తగ్గించాలని కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించింది.
అయితే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం కూడా లేకపోలేదు. ప్రస్తుతం భారత ఆహార సంస్థ అయితే వద్ద ఉన్న 2.31 కోట్ల క్వింటాళ్ల పాత స్టాక్ ను కొంత మొత్తాన్ని అమ్మి వేయడం ద్వారా... కొత్తబియ్యం నిల్వలకు అవకాశం ఏర్పడుతుందని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే భారత ఆహార సంస్థ వద్ద 3.73 కోట్ల టన్నుల గోధుమలు నిలువలు ఉన్నప్పటికీ వాటిని మాత్రం రిజర్వ్డ్ ధరలను తగ్గించకపోవడం గమనార్హం. అయితే ప్రస్తుతం బియ్యం విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో త్వరలో బియ్యం ధరలు భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం హోల్సేల్ మార్కెట్ లోనే కాదు రిటైల్ మార్కెట్లో కూడా బియ్యం ధరలు తగ్గే అవకాశముంది.