ఈ సారి బీజేపీ వ్యూహమేంటో.?

frame ఈ సారి బీజేపీ వ్యూహమేంటో.?

praveen

మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడిన అప్పటి నుంచి ఎన్నో ట్విస్టులతో తెరమీదకు వచ్చాయి. బీజేపీ శివసేన కూటమి విభేదించడం తో శివసేన పార్టీ తమ నాయకుని ఎట్టి పరిస్థితుల్లో మహారాష్ట్ర తర్వాత ముఖ్యమంత్రిని చేయాలనే దృఢ నిశ్చయంతో ఉండడంతో ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీలతో మంతనాలు మొదలుపెట్టింది. అయితే ఎన్సీపీ  కాంగ్రెస్ పార్టీలతో శివసేన చర్చలు ఒక కొలిక్కి వచ్చి ఇంకొన్ని రోజుల్లో మహారాష్ట్రలో ఏర్పడిన రాష్ట్రపతి పాలన తొలగి  ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీల మద్దతుతో శివసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అప్పటివరకూ ఫుల్లుగా సైలెంటుగా ఉన్న బిజెపి పార్టీ సరికొత్త వ్యూహాన్ని తెరమీదికి తెచ్చి ఎన్సీపి నేత శరద్ పవార్ మద్దతుతో  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేశారు. రాత్రికి రాత్రి మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలు అన్నింటినీ మారుస్తూ బిజెపి వేసిన వ్యూహంతో మహారాష్ట్ర రాజకీయాల్లో  ఒక్కసారిగా సంచలనం రేగింది. 

 

 

 

 మహారాష్ట్రలో బిజెపి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ రోజుకో ట్విస్ట్ తెరపైకి వస్తూనే ఉంది. బీజేపీకి మద్దతు  తెలపడం అజిత్ పవార్ సొంత నిర్ణయం అని ఎన్సీపీ పార్టీ ఎప్పుడూ బీజేపీకి మద్దతు తెలపదంటూ  ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించటం  మహా రాజకీయాల్లో  కొత్త సంచలనానికి తెర లేపింది. అంతేకాకుండా అజిత్ పవార్ ని ఎన్సీపీ ఎల్పీ నేత పదవి నుంచి తొలగిస్తున్నట్లు శరత్ పవార్  నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే రాత్రికి రాత్రి మంతనాలు జరిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిజెపి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కు బలం  నిరూపణకు ఈనెల 30 వరకు సమయం ఇచ్చారు గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ .  కాగా ఎన్సీపీ  కాంగ్రెస్ శివసేన పార్టీలు బీజేపీ బలనిరూపణకు 24 గంటల సమయం మాత్రమే ఇవ్వాలని ఎక్కువ సమయం ఇస్తే తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి అవకాశం ఉందంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

 

 

 

 నేడు సుప్రీం కోర్టులో దీనిపై విచారణ జరపగా వాడివేడిగా వాదనలు జరిగాయి. ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేసేందుకు సీఎం అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నర్ కు సమర్పించిన లేఖలన్నింటిని  సుప్రీంకోర్టు పరిశీలించిన అనంతరం 24 గంటల్లో దేవేంద్ర ఫడ్నవిస్ బలనిరూపణ చేయాలని...  కేవలం అసెంబ్లీ లో మాత్రమే బల నిరూపణ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మహా రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. అటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్  మాత్రం తమ వెంట 52 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటూ ఇప్పటికే తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉండాల్సి ఉంటుంది. కాగా ఇప్పటికే మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని పాటు చేసేందుకు బీజేపీ అధిష్టానం సరికొత్త వ్యూహాన్ని అమలు చేసి రాత్రికి రాత్రి మంతనాలు జరిపి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి తెలిసిందే. మరి బలనిరూపణకు దేవేంద్ర ఫడ్నవీస్ కి 24 గంటల సమయం మాత్రమే ఇవ్వడంతో... ఇతర పార్టీల ఎమ్మెల్యేల అందరిని తమ వైపు తిప్పుకునేందుకు బిజెపి 24 గంటల్లో ఎలాంటి వ్యూహం అమలు చేయనుంది అనేది ప్రస్తుతం  మహా రాజకీయాల్లో  ఉత్కంఠగా మారింది. సరికొత్త వ్యూహంతో  ఎమ్మెల్యేలను ఆకర్షించి ప్రభుత్వాన్ని నిలుపుకుంటుందా లేక బలనిరూపణ చేయలేక బిజెపి ప్రభుత్వం కూలిపోతుందా తెలియాలంటే 24 గంటలు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: