
మహా లో కూడా కర్నాటకం రిపీటవనుందా ?
మహారాష్ట్ర లో ఎవరూ ఊహించని విధంగా రాత్రికి రాత్రి మంతనాలు జరిపి ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతు బీజేపీ అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై బల నిరూపణకు ఈనెల 30 వరకు సమయం ఇచ్చారు గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ . అయితే దీనిపై ఎన్సీపీ కాంగ్రెస్ శివవసేన పార్టీలు బలనిరూపణకు 24 గంటల సమయం మాత్రమే ఇవ్వాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. కాగా దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధం అంటూ ప్రకటించింది. అంతేకాకుండా బలనిరూపణకు గవర్నర్ కు సమర్పించిన లేఖలను సుప్రీంకోర్టులో సమర్పించాలని సూచించింది.దీనిపై రెండో రోజు సుప్రీంకోర్టులో విచారణలో భాగంగా వాడివేడి వాదనలు జరిగాయి. సీఎం గా ప్రమాణ స్వీకారం చేసి ఫడ్నవిస్ కు అసలు మెజారిటీ ఉందా అంటూ సుప్రీం కోర్టును ప్రశ్నించింది ...24 గంటల్లో బలనిరూపణ చేయాలనీ సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజ్ భవన్ మెజారిటీ నిరూపించలేదు అన్న సుప్రీంకోర్టు అసెంబ్లీలో మాత్రమే పరీక్ష జరగాలంటూ ఆదేశించింది.
అయితే బలపరీక్ష నిర్వహించేందుకు రెండు మూడు రోజులు సమయం కావాలంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరినప్పటికీ... తుషార్ మెహతా వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పార్టీ ఫిరాయింపుల కు తావు లేకుండా 24 గంటల్లోనే బలపరీక్ష నిరూపించుకోవాలని సూచించారు. తనకు సరైన బలం ఉందని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు... బలపరీక్ష నిరూపించుకోవడానికి అభ్యంతరం ఏంటని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. కేంద్రం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్... మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో గవర్నర్ ఏకపక్ష నిర్ణయం తీసుకోలేదని ఎన్నికల ముందు పొత్తులపై ఆయనకు అవగాహన ఉంది అంటూ సుప్రీం కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి, గవర్నర్ మధ్య సాగిన లేఖల వివరాలను సుప్రీం కోర్టులో సమర్పించారు సొలిసిటర్ జనరల్.
అయితే సొలిసిటర్ జనరల్ సమర్పించిన నివేదికలు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ గవర్నర్కు ఏమని లేఖరాశారు లేఖలు ఏమని పేర్కొని ఉంది ఎంతో సుప్రీంకోర్టు పరిశీలించిన అనంతరం 24 గంటల్లో బలపరీక్ష నిరూపించాలంటూ దేవేంద్ర ఫడ్నవిస్ ను ఆదేశించింది సుప్రీంకోర్టు.ఇదిలా మహారాష్ట్ర అసెంబ్లీ స్థానాలు బిజెపి గెలిచిన అసెంబ్లీ స్థానాలు 105. శివసేన 56 అసెంబ్లీ స్థానాల్లో గెలువగా.. ఎన్సీపీ 54, కాంగ్రెస్ పార్టీ 44 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గాను మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145 మంది ఎమ్మెల్యే సంఖ్య బలం ఉండాలి. అయితే ఇప్పటికే బిజెపికి 11 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా 29 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. అటు ఎన్సిపి కాంగ్రెస్ శివసేన మూడు కలిపితే 144 మంది ఎమ్మెల్యేలు అవుతారు.వీరికి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకొక ఎమ్మెల్యే మద్దతు కావాల్సి ఉంది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ కాంగ్రెస్ శివసేన కూటమికి ఎక్కువ అవకాశాలు ఉన్నప్పటికీ... రెబెల్స్ వారికి సపోర్ట్ చేస్తారా లేదా అన్నది మాత్రం ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.
అయితే ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాలు గతంలో కర్ణాటక రాజకీయాలను తలపిస్తున్నాయి. కర్ణాటకలో బిజెపి మెజారిటీ స్థానాలు గెలిసినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా స్థానాల్లో మాత్రం గెలవలేదు. ఈ నేపథ్యంలో జేడీఎస్ కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ బీజేపీ పట్టువదలకుండా జేడీఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆకర్షించి చివరికి కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చేసి బిజెపి అధికారాన్ని చేపట్టింది.ప్రస్తుతం మహారాష్ట్రలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతున్నట్లు కనిపిస్తుంది . మరి ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 24 గంటల్లో బిజెపి బల నిరూపణ చేసుకుని ప్రభుత్వాన్ని కొనసాగిస్తుందా... లేక గతంలో అందరూ ఊహించినట్టుగానే ఎన్సీపీ కాంగ్రెస్ శివసేన కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది. అది ఇంకో ఇరవై నాలుగు గంటలు ఆగాల్సిందే. ఒకవేళ ఎన్సీపీ శివసేన కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ... మహారాష్ట్రలో కూడా ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి బిజెపి కొంత మంది ఎమ్మెల్యేలను ఆకర్షించి... కర్ణాటకలో లాగా మహారాష్ట్రలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు.