
డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ను చితకబాదిన యువకులు... కారణం ఏంటంటే.?
ఆకతాయిల బెడద రోజు రోజు కు పెరిగి పోతున్నది. ఒకప్పుడు పోలీసులను చూసి బెదిరిపోయే ఆకతాయిలు ఇప్పుడు పోలీసులకు కూడా భయపడటం లేదు. ఏకంగా పోలీసులపై దాడులకు పాల్పడుతున్నారు. డ్యూటీలో ఉన్న పోలీసులు అని కూడా చూడకుండా వారి పైన దాడికి పాల్ప డుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది . డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ పై ముగ్గురు యువకులు విచ్చలవిడిగా దాడి చేశారు. ఆ ముగ్గురు యువకుల్ని స్థానికులు ఆపేందుకు ప్రయత్నించినా ఆ ముగ్గురు యువకులు మాత్రం అస్సలు ఆగలేదు . ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ముగ్గురు యువకులు కానిస్టేబుల్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచగా కానిస్టేబుల్ని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. కాగా ముగ్గురు యువకులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
వివరాల్లోకి వెళితే... తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆనంద్ నగర్ లోని ఆటో స్టాండ్ వైపు గా ముగ్గురు యువకులు ఒకే వైపు వెళ్తున్నారు. అయితే అటువైపుగా వెళ్తున్న కానిస్టేబుల్ నాగేశ్వర్ బైక్ ను ఢీకొట్టారు ఆ ముగ్గురు యువకులు . కానిస్టేబుల్ బైక్ ని ఢీ కొట్టి పరారు అవుతుండగా ఆ ముగ్గురు ప్రయాణిస్తున్న వాహనాన్ని కానిస్టేబుల్ నాగేశ్వర్ ఫోటో తీశారు. దీంతో ఆ ముగ్గురు యువకులు కోపంతో ఊగిపోయారు. ఏకంగా డ్యూటీ లో ఉన్నది కానిస్టేబుల్ అని కూడా చూడకుండా ఆ ముగ్గురు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఓకే సారీ మూకుమ్మడిగా ముగ్గురు యువకులు దాడి చేయడంతో కానిస్టేబుల్ వారిని నివారించేందుకు ప్రయత్నించినా సాద్య పడలేదు . దీంతో కానిస్టేబుల్ ను చితకబాదారు ఆ ముగ్గురు యువకులు. కానిస్టేబుల్ ను చితకబాదుతున్న ఆ ముగ్గురు యువకుల్ని ఆపేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ కూడా ముగ్గురు యువకులు ఆగకుండా విచక్షణారహితంగా కానిస్టేబుల్ నాగేశ్వర్ పై దాడి చేశారు..మా బైక్ ని ఫోటో తీస్తావా అంటూ బూతులు తిడుతూ కానిస్టేబుల్ నాగేశ్వర్ ను చితకబాదారు ముగ్గురు యువకులు.
ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన కానిస్టేబుల్ నాగేశ్వర్ ను ఆస్పత్రికి తరలించారు స్థానికులు. బాధిత కానిస్టేబుల్ నాగేశ్వర్ కోరుకొండ స్పెషల్ బ్రాంచ్ లో విధులు నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్ పై విచక్షణ రహితంగా దాడి చేసిన ముగ్గురు యువకుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మిగతా ఇద్దరు యువకుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. కాగా స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. డ్యూటీలో ఉన్న ఒక కానిస్టేబుల్ పై ముగ్గురు యువకులు మూకుమ్మడిగా దాడి చేయడం ప్రస్తుతం స్థానికంగా దుమారం రేపుతోంది. కాగా ఈ ఘటనలో కానిస్టేబుల్ నాగేశ్వర్ తీవ్ర గాయాలపాలయ్యారు.