
పరువు హత్య... కిరోసిన్ పోసి కన్న కూతురినే.?
రోజురోజుకు పరువు హత్యలు పెరిగిపోతున్నాయి. కులాంతర ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు అని కోపంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కొడుకు కూతురు అని కూడా కడతేర్చేందుకు వెనకాడడం లేదు తల్లిదండ్రులు. కులం అనే ముసుగులో కళ్ళు మూసుకుపోయి రాక్షసులుగా మారి హత్యలు చేస్తున్నారు. రోజు రోజుకు సమాజం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్న ఈ కాలంలో కూడా చాలామంది ఇంకా పరువు హత్యలకు పాల్పడుతున్నారు. ఏ కులం మతం అని తేడాలు ఉండకూడదని ఎంతోమంది చెబుతున్నప్పటికీ కులాంతర హత్యలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.. కులం పిచ్చి తో కళ్ళు మూసుకుపోయి పేగు తెంచుకుని పుట్టిన కన్న బిడ్డలనే చంపేస్తున్నారు. కాగా రోజురోజుకు కులాంతర హత్యలు ఎక్కువ అవుతున్నాయి. తమ పిల్లలు కులాంతర వివాహాలు చేసుకొవటం వల్ల... పది మందిలో ఎక్కడ పరువు పోతుందని ఏకంగా పిల్లలు కడతెరుస్తున్నారు.
దేశవ్యాప్తంగా రోజురోజుకు పరువు హత్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటికే సమాజంలో ఎన్నో ఇలాంటి ఘటనలు చూసాం. ఇప్పుడు ఇలాంటి ఘటనే ఇంకోటి చోటుచేసుకుంది. తమ కూతురు తమకంటే తక్కువ కులం యువకుని ప్రేమించిడంతో పరువు పోతుందనే భావనతో కన్న కూతురునే కడతేర్చారు తల్లి. అతి కిరాతకంగా సజీవ దహనం చేశారు. తమిళనాడులో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. నాగపట్టణం జిల్లా వాంగ్మంగళం గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉమా మహేశ్వరి, కన్నన్ దంపతులకు కుమార్తె జనని. అయితే జనని ఓ దళిత యువకున్ని ప్రేమించింది. అయితే తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భావించి ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందామని ఇద్దరు భావించారు.
పారిపోయి పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడింది. ఈ క్రమంలోనే జనని తో ఆమె తల్లి వాగ్వివాదానికి దిగింది. పరువు పోతుందని దళిత యువకుణ్ని పెళ్లి చేసుకుంటే అందరిలో తలదించుకోవాల్సి ఉంటుంది అంటూ తల్లి ఎంత చెప్పినప్పటికీ జనని వినలేదు. అతన్నే పెళ్లి చేసుకుంటాను అతనే కావాలి అంటూ తేల్చి చెప్పేసింది. దీంతో నలుగురిలో పరువు పోతుందనే భావనను తట్టుకోలేక క్షణికావేశంలో కూతురిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది ఆ తల్లి. అయితే కూతురు మంటల్లో సజీవదహనం కావడం చూసి తట్టుకోలేక ఆ తర్వాత తాను కూడా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. కనుక ఈ ఘటనలో జనని అక్కడికక్కడే సజీవ దహనం కాగా ఉమామహేశ్వరి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. కాగా స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.