నాడు కులపిచ్చితో ఒకరు, నేడు మతపిచ్చితో మరొకరు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారట?

ఆంధ్రప్రదేశ్ విభజన తరవాత ఏర్పాటైన అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాజధాని ఎంపికలొనే స్వార్ధపర నిర్ణయం తీసుకున్నాడు. సామాన్య ప్రజలెవరూ కోరని, రాజధాని ఏర్పాటుకై ఏర్పడ్ద శ్రీకృష్ణ కమీషన్ తన నివేదికలో చెప్పని విజయవాడ - గుంటూరు ప్రాంతంలోని "అమరావతి" ని రాజధానికై ఎంపిక చేయటంలో ఆయన స్వార్ధం ఆయన సామాజికవర్గ స్వార్ధ ప్రయోజనం తప్ప మరే ఇతర ప్రయోజనం లేదు. అసలే బాబు సామాజికవర్గ ప్రజలు మరే ఇతర సామాజిక వర్గాలవారికి నివాస గృహాలను కూడా అద్దెకు ఇవ్వరని ప్రతీతి. అలాగే ఆయన పాలనా కాలం మొత్తం కూడా సకల రాజకీయ ఆర్ధిక సామాజిక వినోద వికాస విద్య ఆరోగ్య ఒక రంగమేమిటి అన్నీ రంగాల్లో ప్రయోజనాలన్నీ సినిమా అవార్డులతో సహా తన సామాజిక వర్గం వారికే కట్టబెట్టటం అందరికీ తెలిసిందే.    

ఇప్పుడు తాజాగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీరు మతపరంగా నారా వారినే తలపిస్తుంది. తాడికొండ షెడ్యూల్డ్ కాస్ట్ రిజర్వుడ్ శాసనసభ స్థానం నుండి ఎన్నికైన "ఉండవల్లి శ్రీదేవి" పై విచారణ చేసి ఆవిడ క్రిస్టియనా?, హిందూనా? అన్నది రిపోర్ట్ చేయమని రాష్ట్రపతి కార్యాలయం నుండీ నాటి ఏపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కార్యాలయానికి శ్రీముఖం అందిందట. 

ఆవిడ క్రిస్టియన్ కాదు హిందూ అని నిర్ధారించమని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఎల్వి సుబ్రహ్మణ్యం మీద తీవ్రవత్తిడి వచ్చిందంట.యధార్ధవాది అయిన ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆ పని చేయలేను అని చెప్పటం, అలాగైతే ఇక అతన్ని ఆ పదవి నుంచి తొలిగించటం ఉత్తమమని ముఖ్యమంత్రి కార్యాలయం భావించడం జరిగిందట. 
ఇప్పుడు గనుక ఆమె శాసనసభ సభ్యురాలి పదవిపై అనర్హత వేటు పడితే అది అంతటితో ఆగదని, చాలా మంది శాసనసభ్యులు ఆయన పైన తీవ్ర ప్రభావం పడుతుందని, అంతే గాక, షెడ్యూల్డ్ తరగతుల వరు మతం మారితే వారు "వెనుకబడిన తరగతుల - సి - కాటగిరీ" క్రిందకు వస్తారు. ఆ విషయం జనాల్లోకి వెళితే అప్పుడు ఈ షెడ్యూల్డ్ తరగతుల వారు మత మార్పిడులకు ఇష్టపడరని, మత మార్పిడులు తగ్గిపోతాయని సుబ్రహ్మణ్యంను ఆ పదవి నుండి తొలగించారని అంటున్నారు. 

ఇప్పడు ఉండవల్లి శ్రీదేవిని “హిందూ” అని ధృవీకరించే వ్యక్తి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అవుతారని విరివిగా ప్రచారంలో ఉంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా  నీలం సాహ్ని  పాలనా బాధ్యతలు తీసుకున్న వేళ తప్పుడు ధృవీకరణ పత్రం రాష్ట్రపతికి పంపిస్తుందేమో చూడాలి. జనంలో ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అన్నీ ప్రఖ్యాత హిందూ దేవాలయాల్లో గతంలోలా చాపకింద నీరులా కాకుండా బట్టబయలు బహిరంగాగానే క్రిష్టియన్ మతవ్యాప్తి జరుగుతుంది. ఇది ఒక రకంగా మెజారిటీ మతస్తు ల విశ్వాసంపై దాడి చేయటమే అని, అధిక సంఖ్యాక హిందువుల మనసులు దహించుకు పోవటం చూస్తునే ఉన్నాం.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: