ఎంఎల్ఏని ఇరికించబోయి బోల్తా పడిన టిడిపి

Vijaya

ఓ హత్య కేసులో వైసిపి ఎంఎల్ఏ దాడిశెట్టి రాజాను ఇరికించబోయిన తెలుగుదేశంపార్టీ చివరకు తానే బోల్తా పడింది.  తూర్పుగోదావరి జిల్లాలోని తుని మండలంలో ఆంధ్రజ్యోతి విలేకరిగా పనిచేస్తున్న కాతా సత్యనారాయణ ఈనెల 15వ తేదీన  హత్యకు గురైన విషయం అందరికీ తెలిసిందే. ఎంఎల్ఏనే తన అన్నను హత్య చేయించాడని విలేకరి తమ్ముడు చెప్పటం అప్పట్లో సంచలనంగా మారింది.

 

ఎప్పుడైతే రాజా పై ఆరోపణలొచ్చాయో ఇంకేముంది ఎల్లోమీడియా రెచ్చిపోయింది. వెంటనే పోలీసులు కూడా రాజాపై కేసు నమోదు చేయటం జిల్లాలో సంచలనంగా మారింది. తీరా చూస్తే చివరకు  ఏమైంది ? జరిగిన హత్యతో రాజాకు అసలు సంబంధం లేదని తేలిపోయింది. ఇదే విషయాన్ని ఎంఎల్ఏ కూడా చాలా సార్లే చెప్పారు. అయినా ఎల్లోమీడియా, టిడిపి పట్టించుకోలేదు.

 

విలేకరి సోదరుడు చెప్పిన వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే వీళ్ళలో ఎవరికీ హత్యతో సంబంధం లేదని అర్ధమైపోయింది. దాంతో ప్రత్యేకంగా నాలుగు బృందాలను నియమించి జిల్లా మొత్తాన్ని జల్లెడపట్టటంతో చివరకు హంతకులు దొరికారు. వాళ్ళను ఎస్సీ నయీం మీడియా ముందుకు తీసుకొచ్చి హత్యకు కారణాలను చెప్పించారు లేండి.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే విలేకరి పెద్ద బ్లాక్ మెయిలరట. తమ బలహీనతలను అడ్డంపెట్టుకుని విలేకరి లక్షల రూపాయలు అప్పటికే దోచుకున్నాడని హంతకులు చెప్పారు. అంటే విలేకరి వృత్తిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిలర్ గా తయారయ్యాడని అర్ధమవుతోంది. దానికి తోడు యనమల రామకృష్ణుడు కుటుంబానికి విలేకరి బాగా సన్నిహితుడు. దాంతో యనమల కుటుంబం అండతో యధేచ్చగా దందాలకు పాల్పడ్డాడని అర్ధమవుతోంది.

 

పైగా యనమల సోదరులు వైసిపి నేత రాజాపై పోటి చేసి రెండుసార్లు ఓడిపోయారు. దాంతో వారికి రాజా అంటే బాగా కడుపుమంట బాగా ఉంది. అందుకనే ఉద్దేశ్యపూర్వకంగానే దాడిశెట్టి రాజా పేరును హత్యకేసులో ఇరికించి ఉండొచ్చనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అంటే విలేకరి చేసిన ఓవర్ యాక్షనే దీనికంతటికి మూలమని అర్ధమైపోవటం లేదూ ?

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: