దగ్గుబాటి వెంకటేశ్వర రావు వైసీపీకి గుడ్ బై

Suma Kallamadi
సీనియర్ ఎన్టీఆర్ పెద్ద అల్లుడు చంద్రబాబు నాయుడు సోదరుడైన డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు ఆయన పార్టీ అగ్రనేత విజయసాయిరెడ్డికి సమాచారం ఇవ్వడం జరిగింది. చాలా కాలంగా దగ్గుపాటి వైసీపీని వీడుతారని ప్రచారం జరుగుతున్నవిషయం తెలిసిందే ఇప్పుడు అది నిజమైంది. దగ్గుబాటి వైసీపీ లో ఉండగా ఆయన భార్య పురంధరేశ్వరి బీజేపీలో ఉండటాన్ని జగన్ ఆక్షేపించి  ఉంటే ఇద్దరు ఒకే పార్టీలో ఉండాలని స్పష్టం చేయగా  పురందేశ్వరి అందుకు సమ్మతించలేదు. ఆమె  జెపి లోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారు.


ఈ నేపథ్యంలో అనివార్యమై దగ్గుబాటి  వైసిపి నుండి బయటికి రావడం జరిగింది. వైసీపీలో చేరిన సంవత్సరం లోపలే అదీ అవమానకర పరిస్థితుల్లో దగ్గుబాటి బయటకు రావడం ఆయన వర్గీయులకు మనస్తాపం కలిగిస్తుంది. నిజానికి వైసిపి దగ్గుబాటి కి అచ్చి రాలేదు. 1983 నుండి రాజకీయాల్లో ఉన్న  దగ్గుబాటి  మొన్నటి ఎన్నికల వరకు ఎకడ పోటీ చేసినా గెలిచి అజేయుడన్న పేరుతెచ్చుకున్నారు. అయిదు సార్లు అసెంబ్లీకి, ఒకసారి లోక్ సభకు ఒకసారి రాజ్యసభకు దగ్గుబాటి ఎన్నికయ్యారు. తొలిసారిగా 2019 లోనే ఆయన పర్చూరులో ఓటమి పాలు అవ్వడం జరిగింది. 


నిజానికి 2019 లో కూడా ఆయన పోటీ చేయదల్చు కోలేదు. తన కుమారుడు హితేష్ కు వైసీపీ టిక్కెట్ ఇప్పి౦చడానికి ఆయన వైసీపీలో చేరడం జరిగింది. అయితే హితేశ్ కు గ్రీన్ కార్డు సమస్య ఎదురవడంతో దగ్గుబాటి పోటీ చేయాల్సి వచ్చింది. జీవితంలోనే తొలిసారిగా ఆయన పరాజయం పాలయ్యారు. ఆ తరువాతే దగ్గుబాటికి కష్టాలు మొదలయ్యాయ. పార్టీ సైతం ఆయన ని దూరంగా పెట్టింది. చివరకు ఆయనే పార్టీ నుండి నిష్క్రమించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. అయితే దగ్గుబాటి అనుచరులు వైసిపి వ్యవహార శైలిని  తీవ్రంగా ఖండిస్తున్నారు.


దగ్గుబాటి వైసీపీ లోకి వస్తాం అన్నప్పుడే ఆయన భార్య పురంధరేశ్వరి విషయంలో స్పష్టత తీసుకోకుండా అప్పుడు సరేనని ఇప్పుడు అదే కారణంతో ఆయన ని పార్టీ నుంచి బయటకు పంపడాన్ని వారు నిరసిస్తున్నారు. దీని వెనక వైసీపీ లోనే ఉన్న దగ్గుబాటి అత్తగారు లక్ష్మీపార్వతి హస్తం ఉందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద దగ్గుబాటి రాజకీయ జీవితంలో ఇదో చేదు అనుభవం అనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: