ప్రియుడి పై ప్రేయసి యాసిడ్ దాడి ...

Suma Kallamadi

ప్రేమ పేరుతో మోసం చేసిన ఒక యువకుడి పై పగ తీర్చుకుందో యువతి. పెళ్లికి నిరాకరించాడన్న కోపంతో అతడిపై ఏకంగా యాసిడ్‌తో దాడి చేసింది. ఉత్తరప్రదేశ్‌ లోని అలీఘర్‌ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. జీవన్‌ ఘర్ ప్రాంతానికి చెందిన యువతి స్థానికంగా ఉండే ఫైజాద్‌ అనే యువకుడితో కొద్దీ కాలంగా పరిచయం ఏర్పడింది. తర్వాత ఇద్దరు ప్రేమించుకొని బాగానే చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. యువకుడు కూడా పెళ్లి చేసుకుంటానని ఆమెకు మాయ మాటలు చెప్పి కాలం వెల్లదీసాడు. 


కొద్ది రోజులుగా యువతి తనను పెళ్లి చేసుకోమని ప్రియుడ్ని అడగడం మొదలు పెట్టింది. దీనితో అతడు నెల రోజులుగా ఆమెతో మాట్లాడకుండా ఆమెను దూరం పెట్టాడు. సదరు యువతి ఫోన్ చేస్తున్నా ఫైజాద్ స్పందించకపోవడంతో పగ తీర్చుకోవాలని భావించింది. వెంటనే అదును కోసం ఎదురు చూసి అతడి ఇంటి సమీపంలో నిఘా వేసింది ఆమె. ఫైజాద్ ఇంట్లో నుంచి బయటకు రాగానే తన వెంట తెచ్చుకున్న యాసిడ్ బాటిల్ తీసి అతడిపై అలా పోసేసి వెంటనే అక్కడి నుంచి పారిపోయింది.


యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడ్ని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ దాడితో బాధితుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న యాసిడ్ పోసిన యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు.


ఇది అంతా ఉంటే యువతి రివర్స్‌ లో ప్రియుడి పైనే ఆరోపణలు చేస్తోంది. తనని పెళ్లి చేసుకోకపోతే ఫైజాద్ తన ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడని చెబుతోంది ఆమె. ఈ ఘటనపై పోలీసులు కూడా క్షుణంగా ఆరా తీస్తున్నారు. ఇప్పుడు చూడాలి న్యాయం అందరికి ఒకేలా ఉంటాదో లేకపోతే స్త్రీ మూర్తి అని ఏమైనా కనికరంగా వదిలేస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: