జగన్ లో కనబడుతున్న రెండు షేడ్లు

Vijaya

జగన్మోహన్ రెడ్డి నూరు రోజుల పాలనలో  రెండు షేడ్లు కనబడుతున్నాయి. అవికూడా ఏకకాలంలో జనాలకు అర్ధమయ్యేట్లుగా జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ రెండు షేడ్లు ఏమిటంటే మొదటిదేమో తన  పరిపాలన గురించి జనాల్లో పాజిటివ్ టాక్ వినిపించటం. అంటే జగన్ అవినీతిని సహించడు అనే సంకేతాలు జనాల్లోకి బలంగా పంపటానికి ప్రయత్నిస్తున్నారు.

ఇక రెండో షేడు ఏమిటంటే చంద్రబాబునాయుడు నిప్పు కాదని అత్యంత అవినీతిపరుడని జనాల్లో బాగా చర్చ జరిగేట్లు చూడటం. ఈ రెండు షేడ్లను ఏకకాలంలో బ్యాలన్స్ చేయటం మామూలు విషయం కాదు. ఎందుకంటే, అత్యంత అవినీతిపరుడంటూ ఎల్లోమీడియా, చంద్రబాబు అండ్ కో జగన్ పైన ఎంత బలమైన ముద్ర వేసిందో అందరికీ తెలిసిందే.

నిజానికి జగన్ పై  ఆ ముద్ర ఎప్పటికి పోతుందో ఎవరూ చెప్పలేరు. అందుకనే సిఎంగా వచ్చిన మొదటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. తనపై ప్రత్యర్దులు చేసిన ఆరోపణలన్నీ కేవలం ఆరోపణలే అని నిరూపించేందుకు జగన్ తాపత్రయపడుతున్నారు. అందుకే తన నూరు రోజుల పాలనలో ఎక్కడ కూడా అవినీతి మరకలు అంటకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడైనా అవినీతి జరిగిందని ఆరోపణలు వినబడగానే వెంటనే అలర్టవుతున్నారు.

ఇక రెండో విషయానికి వస్తే తాను నిప్పునంటూ తనకు తానే సెల్ఫ్ అటెస్టేషన్ చేసుకోవటంలో చంద్రబాబు దిట్ట. ఈ విషయంలో చంద్రబాబుపై జనాల్లో పాజిటివ్ టాక్ నడవటానికి ఎల్లోమీడియా చేయని ప్రయత్నం లేదు. అందుకనే పోలవరం, పిపిఏలు, రాజధాని నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు ఇలా... ఎక్కడ చూసినా చంద్రబాబు అవినీతి కంపు కంపుకొట్టేస్తోంది. అదే విషయాన్ని జనాలు కూడా అర్ధం చేసుకోవాలని జగన్  ప్రయత్నాలు చేస్తున్నారు.  ఇందులో భాగంగానే  పోలవరం, పిపిఏలు తదితర ప్రాజెక్టులపై జగన్ విచారణ జరిపిస్తున్నారు.  కొద్ది రోజుల్లో ఈ విషయాన్ని ఎస్టాబ్లిష్ అయితే అప్పుడు రాజకీయాలు ఎలాగుంటాయో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: