ఎడిటోరియల్ : పార్టీలో కోడెల పరిస్ధితి ఎలా తయారైందో తెలుసా ?
చూస్తుంటే పరిస్ధితులు
అలాగే అనిపిస్తోంది. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లోని నేతలు మాజీ స్పీకర్ కోడెల
శివప్రసాదరావును బహిష్కరించినట్లే కనబడుతోంది. టిడిపి హయాంలో ఐదేళ్ళపాటు కోడెల
శివప్రసాద రావు స్పీకర్ గా పనిచేసిన విషయం అందిరికీ తెలిసిందే. ఆ ఐదేళ్ళల్లో
నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో సంతానం చేసిన అరచకాలను ప్రోత్సహించినందుకు
ఇపుడు కోడెల మూల్యం చెల్లించుకుంటున్నారు.
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొడుకు శివ రామకృష్ణ, కూతురు విజయలక్ష్మి చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. వాళ్ళ అవినీతి, దౌర్జన్యాలు, దందాల గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా ఎక్కువే. తమ సంపాదనలో మామూలు జనాలను సరే చివరకు పార్టీ నేతలను కూడా వదిలిపెట్టలేదు. దొరికిన వాళ్ళను దొరికినట్లు పీల్చి పిప్పిచేసేశారు. దాంతో మొన్నటి ఎన్నికల్లోనే కోడెలకు టికెట్ ఇవ్వద్దంటూ నేతలు రెండు నియోజకవర్గాల్లో చేసిన ఆందోళణలు అందరికీ తెలిసిందే.
సరే ఎంతమంది టికెట్ ఇవ్వద్దన్నా చంద్రబాబునాయుడు కోడెలకు టికెట్ ఇచ్చిన ఫలితంగా ఘోరంగా ఓడిపోయారు. అక్కడి నుండి కోడెలకు సమస్యలు మొదలయ్యాయి. ఒకవైపు కేసులు నమోదవుతుంటే మరోవైపు పార్టీ తమకు సంబంధం లేదన్నట్లు కోడెలను గాలికి వదిలేసింది. దాంతో బాధితులు క్యూ కట్టడంతో ఇప్పటికి కుటుంబంపై ఓ 20 కేసులన్నా నమోదయిఉంటాయి.
ఈ నేపధ్యంలోనే రెండు నియోజకవర్గాల్లోని నేతలు కోడెలను బహిష్కరించినట్లే కనబడుతోంది. నేతలెవరూ కోడెల తో మాట్లాడటం లేదు. కోడెల హాజరైన పార్టీ కార్యక్రమాలను నేతలు బహిష్కరిస్తున్నారని సమాచారం. పార్టీ కార్యాలయంలో కోడెల ఉంటే అటువైపు నేతలు తొంగి చూడటం కూడా లేదట. కోడెలను పిలిచిన పార్టీ కార్యక్రమాలకు తమను ఆహ్వానించొద్దని నేతలే పార్టీ ముఖ్యులకు చెప్పేశారట.
సరే అయ్యిందేదో అయిపోయిందని కోడెల ఓ అడుగు ముందేశారని సమాచారం. నేతలతో సయోధ్య చేసుకుందామని కోడెల చేసిన ప్రయత్నాలు కూడా ఎదురుతిరిగిందట. కోడెల ఫోన్ చేస్తుంటే నేతలెవరకూ స్పందించటం లేదని పార్టీ వర్గాలు చెప్పాయి. తన ఇంటికి రావాల్సిందిగా కోడెల ఆహ్వానిస్తున్నా నేతలు బదులు చెప్పటం లేదట. అంటే జరుగుతున్నది చూస్తుంటే పార్టీ నేతలు కోడెలను బహిష్కరించినట్లే కనబడుతోంది. మరి ఈ సమస్యను చంద్రబాబు ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాల్సిందే.