నవ్యాంధ్ర రెండో సీఎంగా వైసీపీ అధినేత వైఎస్.జగన్ ప్రమాణస్వీకారం చేశారు. జగన్ ప్రమాణస్వీకారం ఎలా ? జరుగుతుంది ? తొలి ఫైలుగా జగన్ సంతకం పెట్టేందుకు దేనిని ఎంచుకుంటారని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న వేళ జగన్ సామాజిక ఫెన్షన్ల ఫైలు మీద తొలి సంతకం పెట్టారు. జగన్ తండ్రి వైఎస్ తొలి సంతకం ఉచిత విద్యుత్ మీద పెట్టారు. అది ఓ హిస్టరీ... రికార్డు. ఇప్పుడు జగన్ తండ్రి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ తొలి సంతకంగా సామాజిక ఫెన్షన్ల మీద పెట్టారు.
ఇక తండ్రి సంతకాన్ని అనుకరిస్తూనే వై అనే అక్షరం కాస్త పెద్దదిగా పెట్టి మరీ సంతకం చేశారు. ఇక రూ.2 వేలు ఉన్న ఫెన్షన్‌ను రూ.250 పెంచి రూ. 2250 చేశాడు. ప్రతి యేడాది రూ.250 చొప్పున పెంచుకుంటూ వెళ్లడంతో పాటు తాను హామీ ఇచ్చినట్టుగా రూ.3 వేలు చేస్తానని ప్రకటించారు. ఇక తాను ఇచ్చిన హామీల విషయంలో జగన్ ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు వెళుతున్నాడు. ఇదిలా ఉంటే జగన్ ప్రకటించిన వలంటీర్లు ఆప్షన్ టీడీపీకి మరణశాసనం లాంటిదని... ఈ వలంటీర్ల దెబ్బతో చంద్రబాబు క్లీన్‌బౌల్డ్ అవ్వడం ఖాయమన్న చర్చలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
చంద్రబాబు పెట్టిన జన్మభూమి కమిటీలు ప్రజలను పీక్కు తున్నాయి. ఇవి వాళ్లను పీల్చి పిప్పి చేసి చివరకు చంద్రబాబును సమాధి చేశాయి. ఈ జన్మభూమి కమిటీ సభ్యులు చేసిన అరాచకాలే టీడీపీ ఓటమికి సగం కారణాలు. ఇక ఇప్పుడు వీటికి భిన్నంగా జగన్ ప్లాన్ చేసిన వలంటీర్ల సిస్టమ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. తన పార్టీకి లక్ష్యల సైన్యం గ్రామస్థాయిలో ఏర్పాటు చేసుకునే క్రమంలోనే ఈ వలంటీర్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీర్ చొప్పున ఓవరాల్‌గా రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందిని నియమిస్తున్నారు.
వీరు ఆగస్టు నుంచి పని చేయనున్నారు. వీరికి నెలకు రూ. 5 వేల జీతం ఇస్తున్నారు. గ్రామస్థాయిలో ఎవరు ఏ పథకం కోసం దరఖాస్తు చేసినా 72 గంటల్లో దీనికి పరిష్కారం లభిస్తుంది. నిజంగా గ్రామస్థాయిలో ఇది విప్లవాత్మకం. దీని వల్ల జగన్ తెలివిగా తన పార్టీ కోసం 4 లక్షల మంది సైన్యాన్ని ప్రీ ప్లాన్డ్‌గా రెడీ చేసుకున్న వాడే అవుతాడు. ఇదే స్థాయిలో సచివాలయం పనిచేస్తే వచ్చే ఎన్నికల్లోనూ జగన్ గెలుపును ఎవరూ ఆపలేరు.