బయటపడిన చంద్రబాబు నైజం

Vijaya

అవును చంద్రబాబునాయుడు నైజం మరోసారి బయటపడింది. పార్టీలో తాను తప్ప మరెవరూ ఎటువంటి పదవులు అనుభవించకూడదు. పదవుల్లో ఎవరినీ ప్రశాంతంగా కుదురుకోనీయరు. అందుకు తాజా ఉదాహరణే సమాచర హక్కు చట్టం కమీషనర్ పదవి నియామకం.

 

ఐదేళ్ళల్లో సమాచర హక్కు చట్టం కమీషనర్లందరినీ నియమించే పూర్తి అధికారాలు ఉన్నంత కాలం చంద్రబాబు వాటిని పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత ఏపికి చీఫ్ కమీషనర్ తో పాటు నాలుగు కమీషనర్ పోస్టులు దక్కాయి. అందులో చీఫ్ కమీషనర్ పోస్టుతో పాటు మరో ఇద్దరు కమీషనర్లను మాత్రమే భర్తీ చేశారు. అంటే రెండు కమీషనర్ల పోస్టులను భర్తీ చేయకుండా అలాగే వదిలేశారు.

 

పుణ్యకాలం పూర్తయిపోయి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అప్పుడు హడావుడిగా ఇద్దరు నేతలను కమీషనర్లుగా ప్రతిపాదిస్తు ఆమోంద కోసం గవర్నర్ కు పంపారు. పార్టీ నేతలను కమీషనర్లుగా భర్తీ చేయొచ్చా లేదా అన్నది పక్కన పెట్టేద్దాం. కమీషనర్లుగా పార్టీ నేతలకు ఇవ్వనే కూడదు. ఇద్దామని అనుకున్నపుడు ఆ ఇచ్చేదేదో ఎన్నికల కోడ్ ప్రకటించక ముందే ఇచ్చేసుండచ్చు కదా ?

 

ఇచ్చిన పోస్టులు కూడా భారీ ఎత్తున డబ్బులు తీసుకునే ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. డబ్బులు ఇచ్చారా లేదా అన్నది మూడో కంటికి తెలీదు. నిజంగానే డబ్బులు ఇచ్చారనే అనుకున్నా అదేదో ముందే తీసేసుకుని భర్తీ చేసుంటే డబ్బులు ఇచ్చుకున్న వారికి కనీసం మనశ్శాంతన్నా ఉండేది కదా ? అంటే తాను పోస్టులు భర్తీ చేసినట్లుండాలి కానీ తీసుకున్న వాళ్ళు ప్రశాంతంగా ఉండకూడదన్న చంద్రబాబు నైజం మరోసారి బయటపడింది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: