వాళ్లు పోటీ చేయట్లేదుగా... సో మేం గెలవడం ఖాయం..!! శివసేన వింత వాదన

Vasishta

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం ఖాయమని భాగస్వామ్య పార్టీ శివసేన జోస్యం చెబుతోంది. తమ వాదనను బలపరిచే విధంగా ఓ లాజికల్ కామెంట్ ను కూడా  చేసింది. ప్రస్తుతం జరుగుతన్న ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని ఎన్సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు  శరద్ పవార్, బహుజన్ సమాజ్ పార్టీ  అధినేత్రి మాయావతి ప్రకటించడమే తమ కూటమి విజయ సంకేతమని శివసేన భావిస్తోంది.


బీఎస్పీ అధినేత్రి మాయావతి పోటీ నుంచి తప్పుకోవడానికి రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ రాజకీయ రంగ ప్రవేశం చేయడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. యూపీలో ప్రియాంక గాంధీ చేస్తున్న ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండటంతో మాయావతి పార్టీ కార్యకర్తలకు కంటి మీద కునుకులేకుండా పోతోంది. బీజేపీతో కంటే కాంగ్రెస్ తోనే తమకు అధిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని బీఎస్పీ భావిస్తున్నట్లు సామ్నాలో కథనం ప్రచురితమైంది.


యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమి వ్యూహాలకు కాంగ్రెస్ గండికొడుతోందని, కాంగ్రెస్, బీఎస్పీలకు ఉన్న ఓటు బ్యాంకు ఒకటేనని అభిప్రాయపడుతూ సామ్నా మ్యాగజైన్ వేదికగా శరద్ పవార్ పై విమర్శలను చేసింది. ప్రతిపక్షాలన్నింటిని ఒకే తాటిపైకి తీసుకురావాలని చూస్తున్న శరద్ పవార్, తన పార్టీలోని నాయకులను, కుటుంబసభ్యులను ఏకాభిప్రాయానికి తీసుకురాలేకపోయారని  విమర్శనాస్త్రాలను సంధించారు.


ప్రత్యర్థి బలాలు, బలహీనతల ఆధారంగా పార్టీలు వేసే ఎత్తుగడలను బట్టి గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయి. అలా కాకుండా పోటీ చేయకుండ గట్టున ఉండి ఫలానా పార్టీ గెలవబోతోందంటూ కామెంట్స్ చేయడం ఎలాంటి సంకేతాలిస్తుందనేది ఇప్పుడు అంతుచిక్కడం లేదు. మరి చూద్దాం... వీరి కామెంట్స్ ఏమేరకు నిజమవుతాయో..!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: