చావుబతుకులిక్కడ – చచ్చు రాజకీయాలక్కడ : అసహ్యించుకుంటున్న జనం

         మనరాష్ట్ర కాంగ్రేస్ పాలకులు,నాయకుల చేష్టలు రోజురోజుకు రోత పుట్టిస్తున్నాయి. ఇవి ఇప్పుడు ప్రజాందోలనకే పరిమితం అయ్యాయి.తాజాగా వారి నిర్వాకం వారి పట్ల వారినెన్నుకున్న ప్రజల్లో అసహ్యాన్ని కలిగిస్తున్నాయి. ఇవి ఇంకా పెరిగితే ప్రజల ఆగ్రహానికి వారు గురికాక తప్పని పరిస్థితులు నెలకొనేలా ఉన్నాయి.          ప్రస్థుతం రాష్ట్రంలో నెలకొన్న విధ్యుత్ సంక్షోభం వారి పాపమేన్నది అందరికి తెలిసిందే.ఆపాపానికి రాష్ట్రంలో చావుబతుకుల మద్య కొట్టుమిట్టాడుతున్నారు. వైకాపా నేత విజయమ్మ సిరిసిల్ల చేనేతల దయనీయ స్థితిని గమనించి మద్దతుగా వస్తే నానా రాద్దాంతం చేశారు. ఇప్పుడు ఆనేతన్నలు ప్రభుత్వం చేసిన పాపాలకు బలవంతంగా ప్రాణాలను బలితీసుకుంటున్నారు.          కరెంటుకోతతో తినడానికి తిండికరవై ఒక్క సిరిసిల్లలోనే ఈమద్య అయిదుగురు చనిపోతే కనీసం పరామర్శించి ఓదార్చాలన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండాపోయింది. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెల్లకముందే సిరిసిల్లలో ఒకనేతన్న కరెంటుతీగనే ఉరితాడు చేసుకుని చనిపోతే అదేమి ఎరగనట్టుగా తన సీటు పదిలం కోసం హస్థినకు బయలు దేరారు.             అంటే వారిని నమ్ముకున్న జనం వారి కారణంగా చస్తుంటే వారు మాత్రం అధికారం కోసం,కుర్చీలు కాపాడుకునే పనిలో ఉండడం జనంలో రోతపుట్టిస్తోంది. రాజకీయాల్లో స్వార్థం ఉండాలే కాని వారికి ఆభిక్ష పెట్టిన ప్రజలనే పూర్తిగా విస్మరించడంపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. పార్టీ నాయకుడో,ఏదో కులసంఘ నేతనో అస్వస్థతకు లోనైతే పరామర్శించేందుకు క్యూకట్టే వీరికి సామాన్యులు కన్పిస్తారా.... తప్పక కన్పిస్తారు...ఎన్నికలు వచ్చినపుడు అప్పడు వారడిగే ప్రశ్నలకు ఏం బదులిస్థారన్నది కాదు, ఎలా వారి ముందుకు వెలతారన్నది అసలు ప్రశ్న. మన పిచ్చి కాని ఉచ్చనీచాలు మరచిన మన రాజకీయులు ఇదంతా పట్టించుకుంటారా చెప్పండి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: