వార్నింగులిచ్చే వారికే వార్నింగులు

హైదరాబాద్: వార్నింగులు, డెడ్ లైన్లు పెట్టేటోళ్లకు వార్నింగ్ లు ఇచ్చిన వైనమిది. తెలంగాణ రాష్ర్టం కోసం పోరాడుతున్న టీఆర్ఎస్ పార్టీ నేత హరీశ్ రావు అందరికీ వార్నింగ్ లు ఇవ్వడం, డెడ్ లైన్లు పెట్టడం ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తోంది. అలాంటి హరీశ్ రావుకు ఏకంగా ఇప్పుడు పోలీస్ అధికారుల సంఘం డెడ్ లైన్ పెట్టింది. వార్నింగులిచ్చింది. అది 24గంటలు. వివరాల్లోకి వెళ్లితే.... రైతాంగానికి వ్యవసాయానికి ఏడు గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ కోసం టీఆర్ఎస్ ఉద్యమిస్తోంది. దీనికి స్పందించిన ట్రాన్స్ కో అధికారులు 7గంటల కరంటు ఇస్తామనీ చెప్పి మరిచారు. దీనికి నిరసనగా గత రెండ్రోజుల కిందట హైదరబాద్ లో విద్యుత్ సౌధ వద్ద ఆమరణ దీక్షకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు టీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు. టీఆర్ఎస్ నాయకులకు, డీసీపీ స్టీఫెన్ రవీంద్రకు గత కొంత కాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. కరంటు కోసం ఉద్యమిస్తున్న సందర్భంలోనూ టీఆర్ఎస్ నేత హరీశ్ రావుకు-డీసీసీ స్టీఫెన్కు మధ్య లొల్లి జరిగింది. స్టీఫెన్ తెలంగాణకు వ్యతిరేకమనే భావనకు వచ్చిన హరీశ్ స్టీఫెన్ పై తీవ్ర పరుష పదజాలంతో దూషించాడు. ఇప్పుడు ఇదే హరీశ్కు వార్నింగులు ఇచ్చే పరిస్థితికి దారి తీసింది. సీనియర్ అధికారి అయిన స్టీఫెన్ పై దురుసుగా ప్రవర్తించిన హరీశ్ భేషరతుగా 24గంటల్లో క్షమాపణ చెప్పాలనీ పోలీస్ అధికారుల సంఘం డిమాండు చేసింది. రాజకీయ నాయకులకు భద్రతను కల్పిస్తున్న పోలీసుల పట్ల రాజకీయ నాయకులు దురుసుగా ప్రవర్తించడాన్ని పోలీసుల సంఘం తప్పుబట్టింది. స్టీఫెన్ రవీంద్ర పట్ల దురుసుగా ప్రవర్తించిన హరీశ్ క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలుంటాయనీ పోలీసుల సంఘం తీవ్రంగా హెచ్చరించింది. ఇప్పటి వరకు డెడ్ లైన్లు పెట్టడం...వార్నింగులు ఇవ్వడమే టీఆర్ఎస్ నాయకులకు తెలుసు. ప్రప్రథమంగా టీఆర్ఎస్ నేత హరీశ్కు పోలీస్ అధికారుల సంఘం 24గంటల వార్నింగ్ ఇచ్చింది. పోలీసుల సంఘం ఇచ్చిన టైంలో కొన్ని గంటలు ముగిసింది.కేవలం మరికొన్ని గంటలు మాత్రమే మిగిలింది. ఈ వ్యవహారంలో పోలీసుల సంఘం...టీఆర్ఎస్ నేతలు ఎలా వ్యవహారిస్తారో చూడాలి మరి.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: