సుప్రీంను ఆశ్రయించిన సర్కార్

హైదరాబాద్: డీజీపీ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. డీజీపీగా దినేష్ రెడ్డి నియామకంపై రాష్ర్ట హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ర్ట సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ను వేసింది. దినేష్ రెడ్డిని నిబంధనలకు విరుద్దంగా డీజీపీగా నియమించారంటూ గతంలో మరో సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతంకుమార్ క్యాట్ను ఆశ్రయించాడు. డీజీపీ నియామకం చెల్లదంటూ క్యాటు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ర్ట ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కూడా క్యాట్ తీర్పును సమర్ధించడమే కాకుండా, రాష్ర్ట ప్రభుత్వానికి 5వేల రూపాయల జరిమానను విధించింది. సీనియర్ ఐపీఎస్ అధికారుల లీస్టును ఇవ్వాల్సిందిగా రాష్ర్ట ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ర్ట ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ను వేయడం జరిగింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఉన్న డీజీపీ దినేష్ రెడ్డే తిరిగి డీజీపీగా కొనసాగే అవకాశం వుంది. ఇప్పుడున్న ఐపీఎస్ అధికారులలో దినేషే సీనియర్. ఈయనకన్న సీనియర్ అయిన ఉమేష్ కుమార్ సస్పెండ్కు గురయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: