భవిష్యత్తు భయపెడుతోంది : ప్రతిరాత్రి ఇక కాలరాత్రి

రాష్ట్రప్రజలు ప్రతిరాత్రిని కాలరాత్రిలా గడిపే పరస్థితులు వస్తున్నాయా...పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయి.విద్యుత్ లేనిదే విసుమంత జీవనం కూడా సాగని పరిస్థితి.అదేమో సంక్షోభంలో పడిపోయింది.ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.దీంతో ప్రతిఒక్కరు భవిష్యత్తును తలచుకొని భయపడుతున్నారు. రోజురోజుకు విద్యుత్ కొరత పెరిగిపోతోంది. ఆదుకోవాల్సిన కేంద్రం ఆపని చేయకుండా ఇంకా కష్టాల్లోకి నెడుతోంది.దీంతో ఇది పెరిగే సూచనలే తప్ప తగ్గే అవకాశాలు కనుచూపుమేరలో కన్పించడం లేదు.సమస్యకు మూలాలు వెతికి పరిష్కరించాల్సిన పాలక,ప్రతిపక్షాలు ఒకరిపై మరొకరు విమర్శలుకురిపించుకోవడంతోనే సరిపెడుతున్నారు. ప్రస్తుత పరిస్థితు ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో కనివిని ఎరుగని రీతిలో ప్రజాజీవితం అతలాకుతలం అవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో విభేదాలు వీడి సమస్యను అందరిదిగా భావించి పాటుపడాలి. కాని ఆందోలనలు,దాడులు చేసుకుంటూ పోతే సమస్య సమస్యగానే పెరుగుతూ జనజీవితం స్థంబించిపోతుంది. విద్యుత్ కోతలు అనే బదులు విద్యుత్ సరఫరా వేళలు ప్రకటించే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. మనకు తగినంతగా విద్యత్ మనవద్దనే ఉత్పత్తి అవుతున్నప్పటికి ఈకష్టాలు ఎందుకని రేపు ప్రజలు నిలదీస్తే ఈనాయకులు ఏమని సమాధానం చెబుతారు. గోదావరి మావద్దనుంచి పోతోంది,మాఅవసరాలు తీరాకే మీకు నీళ్లిస్తాం, అని మహారాష్ట్ర కేంధ్రాన్ని ఎదిరించి, అనుమతులు లేకున్నా గోదావరిపై 12 ప్రాజెక్టులు కట్టలేదా... ఇప్పుడు దాని పలితాలు అనుభవించడం లేదా. ఇది అన్యాయం అంటూ మనం సుప్రీంకోర్టుకు న్యాయం కోసం వెలితే ఏంజరిగింది.అది విచారణలోనే ఉంది.ఇక్కడ జరగాల్సింది జరిగిపోయింది. విద్యుత్ విషయంలో మనం ఇలా ఎందుకు వ్యవహరించ కూడదు.తగినంత బొగ్గు,ధర్మల్ విద్యుతో కేంధ్రాలు,చాలినన్ని నీళ్లు జలవిధ్యుత్ కేంధ్రాలు, ఎంతో గ్యాస్,దానికి తగినట్టుగా విద్యుత్ ఉత్పత్తి కేంధ్రాలు మన దగ్గర ఉన్నాయి.మనం మన అవసరాలకోసమే మనవిద్యుత్ తీసుకోవడం అన్యాయమేమి కాదుగా. మనకడుపును కాల్చుకుని ఎదుటివారికి ఎవరైనా అన్నం పెడుతారా...అసలు అలా పెట్టమని ఎవరైనా అడుగుతారా...ఇది జీవన న్యాయం. ఇది జీవిత సూత్రం. పంటలు,పరిశ్రమలు విద్యుత్ కోతతో మూలన పడితే భరిస్తున్న జనానికి వారి సాధారణ జీవనం కూడా సాగని పరిస్థితులు వచ్చాయి. ఇప్పటికైనా రాజకీయాలకతీతంగా అందరు ఏకమై విపత్తు సమయాల్లో వ్యవహరించినట్టుగా ముందుకు కదిలి ముందు సమస్యను పరిష్కరించుకోవాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. ఇప్పుడు స్పందించకపోతే ప్రజల్లో విప్లవం పుడితే పరిస్థితి విషమిస్తుంది.మనబతుకులు తెల్లారుస్తూ పక్కవారికి వెలుగులు నింపేందుకు మనఇంటినుంచి ఎలాపోతుంది అంటూ విద్యుత్ కేంద్రాలను స్థంబింపజేస్తే ఇది మొత్తం దేశంపైనే ప్రభావం చూపెడుతుందని కేంద్రపాలకులు కూడా గుర్తించి వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: