సిగ్గూఎగ్గూ లేని సర్కార్

 పోలీసు (డీజీపీ)ల నియామకాల్లో రాష్ర్టాధినేతలు సిగ్గూఎగ్గూ లేకుండా వ్యవహారిస్తున్న తీరు నవ్వుల పాలు చేస్తోంది. అభాసుపాల్జేస్తోంది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అక్షింతలు వేసినా, చివరకు జరిమాన విధించిన కూడా డీజీపీల నియామకాల్లో చేసిన తప్పుల్లే చేస్తున్నారు. పాలకుల తీరుతో ప్రజల్లో ఒకరకమైన అభిప్రాయానికి వస్తున్నారు. సీనియార్టీని కాదనీ, తమ పట్ల సిన్సియార్టీగా ఉన్న వారిని దొడ్డి దారిన డీజీపీలుగా రాష్ర్టాధినేతలు నియమించుకోవడం అనేక విమర్శలకు దారి తీస్తోంది. చివరకు న్యాయస్థానాలు అక్షింతలు వేసినా కూడా రాష్ట్రాధినేతల తీరులో మార్పు రాకపోవడం నిజంగా సిగ్గుచేటుకరమైన విషయం. గత కొన్నేళ్లుగా రాష్ర్టాధినేతలు డీజీపీల నియామకాల్లో నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. సీనియార్టీని కాదనీ, తనకు నమ్మకస్తులను, మరో మాటలో చెప్పాలంటే తమ వాళ్లను డీజీపీలుగా నియమించుకుంటున్నారు. రాష్ర్టాధినేతగా తనకున్న విచక్షణమైన అధికారాన్ని డీజీపీ నియామకంలో యధేచ్చగా వాడుకుంటున్నారు. న్యాయస్థానాలు తప్పుబట్టినా కూడా వాటిని ఖాతరు చేయకుండా, సీనియర్ ఐపీఎస్అధికారులున్నప్పటికీ వారిని కూడా కాదనీ తనను అనుకూలంగా ఉండేవారిని నియమించుకోవడం రాష్ర్టంలో ఆనవాయితీగా మారింది. ప్రస్తుత డీజీపీ దినేష్ రెడ్డికంటే ముందుగా డీజీపీలుగా పని చేసిన గిరీష్ కుమార్, అరవింద్ కుమార్ ల నియామకం కూడా పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకంగా జరిగింది. ఈ నియామకాలను ప్రభుత్వ ఉద్యోగుల పరిపాలనా పరమైన వివాదాల పరిష్కారం చేసే న్యాయస్థానం(క్యాట్) వ్యతిరేకించింది. సీనియార్టీ ప్రకారమే డీజీపీలను నియమించాలంటూ ఎన్నోమార్లు రాష్ట్ర ప్రభుత్వాధినేతలకు సూచించింది. అయినప్పటికీ వీరిలో ఏమాత్రం మార్పు రాలేదు. క్యాట్ వద్దంటే పై కోర్టులకెళ్లి, పదవీ విరణమ అయ్యేంత వరకు సదరు అధికారులను అదే పోస్టులో కొనసాగించారు. వారి తరువాత దినేష్ రెడ్డిని నియమించారు.   తనకంటే జూనియర్ అయిన దినేష్ను డీజీపీగా నియమించడాన్ని నిరసిస్తూ గౌతంకుమార్ అనే ఐపీఎస్ అధికారి క్యాట్ను ఆశ్రయించారు. గత డీజీపీల నియామకాన్ని తప్పుబట్టినట్టే డీజీపీగా దినేష్ రెడ్డి నియామకం చెల్లదంటూ క్యాట్ తీర్పు ఇచ్చింది. క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ రాష్ర్ట ప్రభుత్వం హైకోర్టుకెళ్లింది. హై కోర్టు కూడా క్యాట్ తీర్పును సమర్ధిస్తూ తీర్పు ఇచ్చింది. అంతే కాకుండా, కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు గానూ రాష్ర్ట ప్రభుత్వానికి 5వేల రూపాయల జరిమాన విధించింది. ప్రభుత్వానికి కోర్టు జరిమాన విధించందంటే అంతకంటే సిగ్గుమాలింది మరొకటి ఉండదు. హైకోర్టు కూడా సీనియార్టీ ప్రకారం డీజీపీలను నియమించాలంటూ మరోమారు రాష్ర్ట ప్రభుత్వానికి సూచించింది. హైకోర్టు తీర్పుతో ఓ ఐదుగురు సీనియర్ అధికారులతో జాబితాను రూపొందించే పనిలో పడ్డది. దీంట్లో కూడా ప్రస్తుత డీజీపీ దినేష్ రెడ్డి పేరును కూడా పొందపరుస్తున్నట్లు సమాచారం. దినేష్ రెడ్డికంటే సీనియర్ అయిన ఐపీఎస్ అధికారి ఉమేశ్ కుమార్ను ఇటీవలనే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఉమేశ్ కుమార్ కంటే ముందు వరుసలో దినేష్ ఉన్నట్లు తెలుస్తోంది. దినేష్ రెడ్డి పదవీ విరమణ చేసేదాకా డీజీపీ సీట్లో కూర్చోబెట్టడానికి రాష్ట్రాధినేత మొగ్గును కనబరుస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. డీజీపీల నియామకాల్లో రాష్ర్టాధినేతలందరూ తమవారే ఉండే విధంగా చూసుకుంటున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. న్యాయస్థానాలు మందలిస్తున్నా కూడా తమకు అనుకూలంగా ఉన్న వారిని ఎలాగో అలాగు చేసి కూర్చుండబెడుతున్నారంటే ఆ సీట్లో ఉన్న వ్యక్తి ప్రభుత్వాధినేతకు ఎంత ఉపయోగపడుతాడో వేరే చెప్పనక్కర్లేదు.  న్యాయస్థానాలు మొట్టికాయలు వేసినా, జరిమానాలు విధించినా కూడా ప్రభుత్వాధినేతల తీరులో మార్పు రావడం లేదంటే సదరు నేతల్ని ఏమనాలి? నిబంధనలకు విరుద్దంగా డీజీపీలను నియమించిన రాష్ట్రాధినేతలకు న్యాయస్థానం వేసిన మొట్టికాయలు మాయని మచ్చని మిగల్చడం తథ్యం తథ్యం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: