అంతా బాగుందని భావిస్తున్న తెలుగుదేశం అసలైన కష్టాలను గుర్తించలేకపోతోంది.రెండు కళ్ల సిద్దాంతంతో రాష్ట్రవ్యాప్తంగా నేతలను కోల్పోయింది.ఆయాప్రాంతాలలో పార్టీని నడిపించే నాయకత్వంలేక శ్రేణుల్లో చీకట్లు కమ్ముకున్నాయి. త్వరలో స్థానిక ఎన్నికలు వస్తే పార్టీ పరిస్థితి ఏమిటన్నది అసలైన సవాల్ గా మారింది. ఈఎన్నికలకు ఇప్పుడే వెల్లే పరిస్థితుల్లో అధికారపార్టీ కూడా లేకపోవడం టీడీపి కి కొంత ఊరటనిస్తున్నా,మరో 20 నెలల్లో సాధారణ ఎన్నికలు వచ్చేస్థాయి. బాబు తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజల్లో స్పందన వస్తున్నా దానిని సొమ్ముచేసుకునే నాయకులు పార్టీలో లేకపోవడం గమనార్హం. ఇప్పుడు కూడా తానే అంతా అయి రాష్ట్రంలో కలియతిరుగుతున్నారు తప్ప స్థానిక నాయకులు పెద్దగా వీటిపై ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడంలేదు. ఇటీవల విద్యుత్, అన్నదాతల సమస్యలపై పార్టీ తరఫున ఆందోలనకు పిలుపునిచ్చినా కూడా ఒక్క హైదరాబాద్ లో ఆయన పాల్గొన్న ఆందోలనే తప్ప రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలో కొన్ని చోట్ల తూతూ మంత్రంగా జరుగగా,కొన్ని చోట్ల నేతలు,కార్యకర్తలు కూడా కరువై చేయలేకపోయింది. ప్రజల్లో పట్టు పెరిగితే ఏంలాభం, దానిని పొందేందుకు నాయకులు లేనపుడు. ప్రతి చిన్నవిషయానికి అధినేతకంటే ముందుగా స్పందించి ఆగమాగం చేసే ఎర్రంనాయుడు లాంటి నేతలు కూడా ఎందుకో మునుపటిలా ఆక్టివ్ రోల్ చేయలేకపోతున్నారు. టీడిపికి వెన్నెముకలా నిలచిన వేణుగోపాలచారి,నాగం జనార్దన్ రెడ్డి,హరీశ్వర్ రెడ్డి లాంటివారికి తోడుగా కొడాలినాని లాంటి వారిని కూడా కోల్పోయి చాలాప్రాంతాల్లో నాయకులే లేని స్థితిలో తెలుగుదేశం కొట్టుమిట్టాడుతోంది. తక్కువ వ్యవధిలో కొత్తనాయకత్వాన్ని సృష్టించి వారి ఎన్నికలకు సిద్దం చేయడం అంత ఆశామాశి పని కాదు. వ్యూహరచనల్లో ఉద్దండపిండమైన చంద్రబాబు ఈ సమస్యను ఎలా అధిగమిస్తారో వేచిచూడాల్సిందే.
మరింత సమాచారం తెలుసుకోండి: