బలపడ్డ ముఖ్యమంత్రి!

Kuthuru Raji Reddy
అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్న తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఎదురులేని ముఖ్యమంత్రిగా నిలిచారు. అధిష్టానం అండదండలుండడం, రెండుసార్లు అవిశ్వాసం ఎదుర్కోవడంతో ఆయన నిజంగానే నిలదొక్కుకున్నారు. ఎలాంటి గ్రూపులు లేకుండా, రాజకీయ వ్యూహం లేకుండా పదవి చేపట్టిన ఆయనను విధేయతే ముందుకు నడిపిస్తున్నది. దీనికి తోడు అవినీతికి తావులేకుండా పాలన సాగించడంతో ఆయనపై విమర్శలకు తావులేకుండా పోయింది. ఒకవైపు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలతో పాటు తమదైన శైలిలో ముందుకు వెళ్లడంలో సిఎం సక్సెస్ అయ్యారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్నా చాకచక్యంగా దానిని ఎదుర్కొంటూ ఆసమ్మతికి తావులేకుండా చూసుకోవడంలో విజయం సాధించారు. మొన్నటి అవిశ్వాసం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇక ఎన్నికల వరకు తన పదవికి డోకా లేదన్న ధీమాతో ముఖ్యమంత్రి ఉన్నారు. కొంతకాలం క్రితం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ని మారుస్తారంటూ ప్రచారం సాగిన అవిశ్వాసం తర్వాత ఆయనకు ఎటువంటి డోకా లేదని తేలిపోయింది, కిరణ్ కుమార్ రెడ్డికి 2014 ఎన్నికల వరకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగాలనే పట్టుదలతో నిరంతరం శ్రమిస్తూ ప్రజల్లోకి వెళ్లడం జరగుతుంది. ప్రతిపక్షాలను నోరుమూయించడంతో పాటు వారికి సమాదానం చెప్పడం కోసం ఆయా శాఖల మంత్రులను సిద్దం చేయడం, తగిన సమాచారంతో సిద్దంగా ఉండే విధంగా మంత్రులతో ఇప్పటికే సమావేశమైన ముఖ్యమంత్రి వారిని అసెంబ్లీ సమావేశాలకు సిద్దం చేశారు. ప్రభుత్వ పథకాలు వివరించే ప్రయత్నంతో పాటు ప్రభుత్వంలో తనకు తిరుగులేదని చాటుకున్నారు. అవసరమైనప్పుడల్లా తానే కల్పించుకొని విమర్శకుల నోరు మూయించారు. ప్రతివిషయంలో ముఖ్యమంత్రి సక్సెస్ కావడంతో ఆయన మరింతగా ముందుకు వెళ్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: