భవిష్యత్తు కోసం ప్రణాళిక చేస్తున్న టీ.కాంగీఎంపీలు

Kuthuru Raji Reddy
తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కొంతమంది భవిష్యత్తు కోసం ప్రణాళికను సిద్దం చేసుకుంటున్నారు. అధిష్టానం తెలంగాణ విషయంలో నాన్చీవేత దోరణి అవలంభించడంతో ఈ విషయం నుండి గట్టెక్కడంకోసం సిద్దపడుతున్నారు. భవిష్యత్తు కోసం ప్రణాళిక సిద్దం చేస్తున్నామని, తెలంగాణ కోసం ఉద్యమం ఎలా చేద్దామని విషయంలో ఎంపీలందరు సమావేశమయ్యారని అనుకుంటే పొరపాటుగానే భావించాలి. ఇప్పుడు భవిష్యత్తు అంటే ఎంపీల భవిష్యత్తుగానే భావించాల్సి ఉంటుంది. అధిష్టానం తెలంగాణ రాష్ట్రం ప్రకటించకుంటే ప్రజలను నమ్మించడానికి ఎలా సిద్దపడాలనే విషయంపైనే టీ కాంగీ ఎంపీలు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. పదేపదే కే.కేశవరావు నివాసంలోనో లేదా ఎంపీ వివేక్ నివాసంలోనో టీ.కాంగీ ఎంపీలు సమావేశమై తర్వాత తెలంగాణ ప్రజలను నమ్మించడానికి మీడియా ముందు ప్రకటన చేస్తుంటారు. కాగా ఇందులో భాగంగానే గురువారం కూడా కేకే నివాసంలో ఎంపీలు సమావేశమై వారి భవిష్యత్తు కోసం ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నారు. బుధవారం నాడు తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు చేసిన హైడ్రామా, రాజీనామాల నిర్ణయం విరమించుకోవడంతో ఎంపీల్లో వైరుద్యాలు చోటుచేసుకున్నాయి. ఇటువంటి సందర్బంలో వారిని బుజ్జగించడంతో పాటు కల్సి ఎలా పనిచేయాలి, టిఆర్ఎస్ పై ఎలా ఎదురుదాడి చేయాలనే విషయంపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: