ఇక నిన్ను సహించం : కేసీఆర్ కు కిరణ్ అల్టిమేటం !

Ravi Chandra
సమర దీక్ష ముగింపు సందర్బంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సీఎం కిరణ్కుమార్రెడ్డి అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మాట్లాడడాన్ని తప్పుబట్టారు. ఒకరాష్ట్రం గురించి, భిన్నభిప్రాయాలున్న అంశంగురించి నిర్ణయం గురించి సమయం కావాలని కోరడం తప్పా అని ప్రశ్నించారు. ప్రజలు కేసీఆర్ను అసహ్యించుకుంటున్నారని, ప్రాంతానికి చెందిన నాయకుడివి నువ్వు , వయసు వస్తే సరిపోదు మాట్లాడే పద్ధతి ఉండాలి, నీ దయా దాక్షిణ్యాల మీద 2009 లో తెలంగాణా కాంగ్రెస్ నేతలు గెలవలేదు , కేవలం ప్రజాబలంతో గెలిచారు , ఆ ఎన్నికల్లో నీ పార్టీకి వచ్చిన సీట్లు కేవలం పది అని ఎద్దేవా చేసారు. దేశానికి దిశ గొప్ప నేత నెహ్రూ అని గుర్తుచేశారు. నెహ్రూ, ఇందిర, సోనియాను విమర్శించే హక్కు కేసీఆర్కు లేదన్నారు. రెండుసార్లు ప్రధాని పదవిని తిరస్కరించిన నేత సోనియా అన్నారు. అలాంటి గౌరవమైన కుటుంబం గురించి మాట్లాడే అర్హత కేసీఆర్కు ఉందా అని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: