వైకాపాలోనూ మొదలైన సమైక్యం, ప్రత్యేకం !

Ravi Chandra
 ఎంత సేపు తెదేపా, కాంగ్రెస్ లను వెటకారం చేస్తూ కాలం వెల్లబుచ్చిన వైకాపాకు కూడా ఇప్పుడు సెగ తగిలింది, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఈ సెగ మూడు ముక్కలాటను తలపిస్తోంది. పార్టీలో నాయకులు ప్రాంతాల వారీగా విడిపోయి ఎవరికి వారు తమ వ్యక్తిగత అభిప్రాయాలంటూ తెలంగాణా అంశంపై చేస్తున్న ప్రకటనలు పార్టీని ఇరకాటంలో పడవేస్తున్నాయి.  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే గుర్నాధరెడ్డి రాష్ట్ర విభజన జరగకుండా ఉండేందుకు అవసరం అయితే ప్రాణత్యాంగం చేసేందుకైనా తాను సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. రాష్ట్ర విభజనను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానన్నారు. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు సమైక్యాధ్ర సమావేశానికి తనను ఆహ్వానిస్తే తప్పక వెళతానని గుర్నాధరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. అఖిలపక్ష సమావేశానికి వెళ్ళి వచ్చిన పార్టీ ప్రతినిధి కే.కే.మహేందర్‌రెడ్డి దీనిపై తీవ్రంగానే ప్రతిస్పందించారు. గుర్నాధరెడ్డి వ్యాఖ్యలు ఆయన సొంత అభిప్రాయాలని వాటితో పార్టీకి ఎటు వంటి సంభంధం లేదన్నారు. తేలంగాణాకు వ్యతిరేకం కాదన్న అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానం ఇదివరకే స్పష్టంగా వచెప్పిందన్నారు. ఈ వార్త జగన్ కూ చేరినట్లు తెలిసింది ! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: