అత్యాచార ఘటనపై ఘటనపై ఢిల్లీ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఐదుగురు నిందితులపై అత్యాచారం, హత్య, హత్యాయత్నం, అపహరణ, సాక్ష్యాధారాల నాశనం వంటి నేరారోపణల కింద వీరిపై కోర్టులో అభియోగ పత్రం సమర్పించారు. వెయ్యి పేజీల ఛార్జ్ షీట్ లో ఐపీసీ 302, 307, 377, 365డి, 395 , 201 సెక్షన్ల కింద ఐదుగురిపై కేసునుల నమోదు చేశారు.
ఈ కేసులో మరో నిందితుడు మైనర్ కావడంతో అతని పేరును పోలీసులు చార్జ్ షీట్ లో చేర్చలేదు. దీంతో మైనర్ యువకున్ని జువైనల్ కోర్టుకు అప్పగించనున్నట్లు తెలిపారు. చార్జ్ షీట్ దాఖలు సమయంలో పోలీసుల అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. బాధితురాలి వివరాలు బయటి వారికి ఎవరికీ తెలియకుండా షీల్డ్ కవర్లో అభియోగపత్రాలను కోర్టుకు అందించారు. మరోవైపు ఈ కేసు విచారణ అంతా వీడియోలు తీయనున్నారు. కేసు సంబంధం ఉన్న వారినే కోర్టులోకి అనుమతిస్తారు.
మరింత సమాచారం తెలుసుకోండి: