సీఎం కిరణ్: విద్యార్థులతో ముఖాముఖి

 హైదరాబాద్: అందరూ అడ్డుపడినా, అనుమానాలు వ్యక్తం చేసినా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేయాలనుకున్న పని చేశారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ‘ఇందిరమ్మ బాట’ కార్యక్రమానికి వెళ్లారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి మొదలు పెట్టాలనుకున్నారు. ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా ఇందిరమ్మను చేసి తీరారు. ఆయన అనుకున్నట్లుగానే శనివారం రాత్రి రంపచోడవరంలోని విద్యార్థులతో ముఖాముఖిని నిర్వహించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అక్కడే బస చేశారు.  ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కిరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందిరబాటను విజయవంతం చేసేందుకు గానూ మంగళవారం నాడు సీఎం క్యాంపు కార్యాలయంలో కిరణ్ అందుబాటులో ఉన్న పలువురు మంత్రులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కిరణ్ చేపట్టిన ఇందిరమ్మబాటకు మంత్రులకు కూడా కొన్ని అనుమానాలు తలెత్తాయి. దీనితో కిరణ్ అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమం అసలు ఉద్దేశ్యం ఏమిటో మంత్రులకు సీఎం వివరించారు. ఇందిరబాటకు సహకరించాల్సిందిగా కిరణ్ మంత్రులను కోరారు. అయినప్పటికీ మంత్రుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదనీ తెలిసింది. రాష్ర్టంలో కరవుతో రైతాంగం అల్లాడిపోతున్నారనీ, కరంటు కష్టాల గురించి చెప్పనక్కర్లేదనీ, గతంలో నిర్వహించిన ప్రజాపథం సందర్భంగా ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీసే అవకాశం వుందనీ మంత్రులు సీఎంతో చెప్పినట్లు గుసగుసలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఇందిరమ్మబాటను నిర్వహించడం అంత బాగుండదనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సీఎం కిరణ్ మాత్రం పట్టువదలని విక్రమార్కుని వలే ఇందిరమ్మబాటకు వెళ్లారు. ఆయన అనుకున్నట్లుగానే తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇందిరమ్మబాటను ప్రారంభించారు. రంపచోడవరంలోనే బస చేశారు. మొత్తానికి కిరణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మబాటపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మంత్రుల ఒత్తిళ్లకు తలొగ్గి కిరణ్ ఇందిరమ్మబాటను విరమించుకుంటారనీ అందరూ అనుకున్నారు. కానీ, కిరణ్ మాత్రం ఇందిరమ్మబాటను ప్రారంభించారు.  రంపచోడవరంలోనే బస చేశారు. విద్యార్థులతో ముఖాముకి సందర్భంగా సీఎం అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు తడబడ్డారు. ఉదయం పూట టిఫిన్ పెడుతున్నారా? అనే ప్రశ్నకు ఓ విద్యార్థి కొంత తడబడ్డారు. టిఫిన్ పెడుతున్నారా, లేదా చెప్పడండి. నేను కూడా పొద్దున టిఫిన్ చేయాలంటూ అడిగారు. అయినా, కూడా సదరు విద్యార్థి కొంత తడబడ్డారు. ఏది ఏమైనా మంత్రులు వద్దన్నా, కిరణ్ మాత్రం తాను చేయాలనుకున్న కార్యక్రమాన్ని చేశారు. దీని వల్ల అటు పార్టీకీ, ఇటు ప్రభుత్వానికి కొంతయినా మేలు జరుగుతుందనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: