రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరోక్షంగా వైకాపా అధినేత జగన్ కు మేలు చేస్తున్నారు. 26 వివాదస్పధ జీవోల జారీపై కిరణ్ కామార్ రెడ్డి తన మంత్రి వర్గ సహచరులను వెనుకేసుకురావటం పరోక్షంగా జగన్ కు ఉపయోగపడుతోంది.
జగన్ పై విచారణ చేపట్టాలని రాష్ట్ర హైకోర్టు, వివాదస్పద జీవోలు జారీ చేసినందుకు ఆరుగురు మంత్రులపై విచారణ జరపాలని సుప్రీం కోర్టు సీబీఐ ను ఆదేశించాయి.
ఈ రెండు కేసులకు చాలా సారప్యత ఉంది. ఈ రెండు కూడా జగన్ అక్రమాస్తుల కేసులకు ముడిపడి ఉన్నవే, అయితే జీవోల జారీ కేబినెట్ సమిష్టి నిర్ణయమని, కిడ్ ప్రోకోలో మంత్రులెవరికీ ప్రమేయం లేదని, కిరణ్ కామార్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు.
దీంతో ఆయన తన మంత్రి వర్గ సహచరులకే కాకుండా జగన్ కు కూడా క్లీన్ చిట్ ఇచ్చినట్లు అయింది. దివంగత వైఎస్ కూడా అప్పటి కేబినేట్ లో భాగమేనని, అందువల్ల కిరణ్ కుమార్ ప్రకటన ఆయనకు కూడా వర్తిస్తుందని, వైఎస్ కూడా కిడ్ ఫ్రోకో కింద లబ్ధి పొందలేదని భావించాల్సి ఉంటుందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
అంతేకాక కోర్టులో కూడా జగన్ లాయర్లు ఈ ప్రకటనను చూసి తమ క్లయింట్ అమాయకుడని చెప్పడానికి ప్రయత్నించబోతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటన తన మంత్రివర్గ సహచరులతో పాటు జగన్ కుకూడా
మరింత సమాచారం తెలుసుకోండి: