అమరావతి : పవన్ సీక్రెట్ మీటింగులా..ఎవరితోనబ్బా ?

Vijaya



జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వ్యవహారం చాలా ఆశ్చర్యంగా ఉంది.  గురువారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ ఆఫీసుకు చడీచప్పుడు లేకుండా చేరుకున్నారు. హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేకవిమానంలో వచ్చారు. అక్కడి నుండి నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎవరు లేకుండానే సీక్రెట్ గా వచ్చారు.  మామూలుగా ఎప్పుడొచ్చినా విమానాశ్రయం నుండి పార్టీ ఆఫీసువరకు భారీ ర్యాలీతో పెద్ద హాంగామా జరుగుతుంది. వేలాదిమంది అభిమానులు నానా గోలచేస్తారు.



అలాంటిది ఇపుడు ఇంత సీక్రెట్ గా రావాల్సిన అవసరం ఏముంది ? పైగా తాను వస్తున్న విషయం కూడా పార్టీ ముఖ్యనేతల్లో ఎవరికీ తెలీదనే అంటున్నారు. వచ్చిన తర్వాత కూడా పార్టీ నేతలతో ఎవరితోను మాట్లాడలేదట. విషయం తెలుసుకుని ఎవరైనా వద్దామని అనుకుని ఫోన్ చేసిన వాళ్ళని కూడా రావద్దని చెప్పారట. దీంతో ఆశ్చర్యపోవటం జనసేన నేతలవంతైంది. తన రాకను పవన్ ఎందుకింత రహస్యంగా ఉంచారు అన్నది చాలామంది అర్ధంకావటంలేదు.



అయితే శుక్రవారం తెలిసిందేమిటంటే జనసేన తరపున రేస్ అనే  సర్వేసంస్ధ రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేస్తోందట. ఎన్ని నియోజకవర్గాల్లో జనసేన బలంగా ఉంది, ఎన్ని నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలున్నాయి ? ఒంటరిగా పోటీచేస్తే ఫలితం ఎలాగుంటుంది ? పొత్తులో అంటే టీడీపీతో వెళితే పరిస్ధితి ఏమిటి ? అనే అంశాలపై రేస్ అనే సంస్ధ చాలా లోతుగా సర్వే చేసిందట.



ఆ సంస్ధకు చెందిన ముఖ్యులతో  మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో పవన్ సమావేశమైనట్లు సమాచారం. అంటే సంస్ధ ఇచ్చే రిపోర్టు ఆధారంగానే ఒంటరిపోరా ? లేకపోతే పొత్తులా ? అనే నిర్ణయం తీసుకుంటారేమో. పొత్తు పెట్టుకోవటం తప్పనిసరైతే ఎన్నిసీట్లు తీసుకోవాలనే విషయమై క్లారిటి వస్తుందేమో. బయటకు పొక్కిన విషయం ప్రకారమైతే సర్వే సంస్ధ ముఖ్యులను హైదరాబాద్ లోని తనింటికే రమ్మంటే సరిపోతుంది కదా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. వాళ్ళతో మంగళగిరి పార్టీ ఆఫీసులో నేతలెవరకి తెలీకుండా సీక్రెట్ గా మీట్ అవ్వాల్సిన అవసరం ఏమిటనేది అర్ధంకావటంలేదు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: