రాయలసీమ : అవినాష్ ను సీబీఐ వెంటాడి వేటాడుతోందా ?

Vijaya




వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ వ్యవహారం మొదటినుండి వివాదాస్పదంగానే ఉంది. వివేకాను హత్యచేసిన దస్తగిరి బయటతిరిగేస్తున్నాడు. తనకు బెయిల్ కావాలని దస్తగిరి కోర్టులో పిటీషన్ వేస్తే సీబీఐ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిందట. వివేకా హంతకుడేమో హ్యాపీగా బయటతిరుగుతు పంచాయితీలు చేసుకుంటు ఎంజాయ్ చేస్తున్నాడు. కేవలం అనుమానితుడు మాత్రమే అయిన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని వెంటాడి వేటాడుతోంది.



ఇప్పుడిదంతా ఎందుకంటే గడచిన నాలుగురోజులుగా తమ తల్లి అనారోగ్యంగా ఆసుపత్రిలో ఉన్నందున అవినాష్ కూడా అక్కడే ఉన్నారు. ఎలాగైనా సరే అవినాష్ విచారణకు హాజరుకావాల్సిందే అంటు సీబీఐ పదేపదే నోటీసులిస్తోంది. ఎంపీ రాకపోవటంతో చివరకు సీబీఐయ్యే కర్నూలుకు చేరుకుంది. దాంతో ఇటు సీబీఐ అటు ఎంపీ మధ్య ఏమి జరుగుతోందో అర్ధంకావటంలేదు. ఆసుపత్రి దగ్గరకు సీబీఐ అధికారులు పెద్దఎత్తున చేరుకోవటంతో ఉద్రిక్తతలు పెరిగిపోతోంది.



ఇక్కడ సీబీఐ వైఖరే చాలా విచిత్రంగా ఉంది. ఎంపీయేమీ అంతర్జాతీయ నేరగాడు కాదు, ఆర్ధిక నేరగాడు అంతకన్నా కాదు. పైగా ఎలాంటి నేరచరిత్ర కూడా లేదు. వివేకాహత్యలో కీలక పాత్రదారని సీబీఐ ఆరోపిస్తోంది. తనకేమీ సంబంధంలేదు పాత్రదారులు, సూత్రదారులు వివేకా కుటుంబసభ్యులే అని ఎంపీ వాదిస్తున్నారు. ఇదే విషయమై సీబీఐ ముందు ఆరుసార్లు విచారణకు హాజరయ్యారు. విచారణకు నాలుగురోజులు వెయిట్ చేసినంత మాత్రాన సీబీఐకి వచ్చే నష్టమేమీలేదు.



ఎంతోమంది ఆర్ధికనేరగాళ్ళు సీబీఐ విచారణనుండి విజయంతంగా తప్పించుకుని తిరుగుతున్నారు. ఇక్కడ ఎంపీ సమస్య ఏమిటంటే ఇఫ్పటికే ఆయన తండ్రి భాస్కరరెడ్డి ఇదే కేసులో జైలులో ఉన్నారు. తల్లి సీరియస్ అయి ఆసుపత్రిలో చికిత్సచేయించుకుంటున్నారు. మరి కొడుకుగా తల్లి బాధ్యతలను దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యతుంది కదా. అందుకనే విచారణకు వారంరోజులు గడువు ఇవ్వమని అడిగారు. పరిస్ధితులు అన్నీ తెలిసిన సీబీఐ అధికారులు అందుకు అంగీకరించకుండా పదేపదే నోటీసులిచ్చి విచారణకు రావాల్సిందే అని వెంటాడుతుండటమే ఆశ్చర్యంగా ఉంది.  ఇందులో ఎల్లోమీడియా పైశాచికత్వం కూడా తక్కువేమీ లేదులేండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: