అమరావతి : ఎన్టీయార్ చుట్టూ ఇన్ని వివాదాలా ?

Vijayaపాపం ఏలోకాన ఉన్నారో కానీ చివరి రోజుల్లో ఎంతో మానసికక్షోభ అనుభవించారు. చనిపోయి ఇంతకాలమైన తర్వాత ఆత్మ మళ్ళీ మానసిక క్షోభ అనుభవించాల్సి రావటమే విచిత్రం. ఇదంతా ఎవరి గురించంటే సీనియర్ ఎన్టీయార్ గురించే. చంద్రబాబునాయుడు వెన్నుపోటు దెబ్బకు ఎన్టీయార్ చివరిరోజులు ఎంతో దయనీయంగా ముగిసింది. బతికున్నపుడు వెన్నుపోటు పొడిచి పదవిలో నుండి దింపేసిన చంద్రబాబు పెద్దాయన పోయిన తర్వాత విగ్రహాలు పెట్టి పూలదండలు వేస్తున్నారు.ఇపుడు శతజయంతి ఉత్సవాల పేరుతో జరిగిన తంతు కూడా వివాదాస్పదమైంది. దాంతో ఎన్టీయార్ ఆత్మ మళ్ళీ క్షోబిస్తుంటుంది. విషయం ఏమిటంటే శనివారం కుకట్ పల్లిలోని ఒక మైదానంలో ఎన్టీయార్ శతజయంతి ఉత్సవాలు జరిగాయి. తెరపైన అందరికీ నందమూరి బాలకృష్ణే కనిపించినా తెరవెనుక అంతా చంద్రబాబే ఉన్నారు. పెద్ద బహిరంగసభ లాగ నిర్వహించాలన్న ఉద్దేశ్యంతో సినీ స్టార్స్ పవన్ కల్యాణ్, ప్రభాస్, చిరంజీవి, జూనియర్ ఎన్టీయార్, కల్యాణ్ రామ్, అల్లుఅర్జున్ లాంటి వాళ్ళని పిలిచారు. పవన్, ప్రభాస్, జూనియర్, అల్లు అర్జున్ హాజరుకాలేదు. చిరంజీవి తరపున కొడుకు రామ్ చరణ్ హాజరయ్యారు.సినీస్టార్లందరినీ పిలిపించి టీడీపీ సత్తా చాటాలన్నది చంద్రబాబు ప్లాన్. ఉత్సవాలకు కూకటపల్లిని ఎంచుకోవటంలోనే వ్యూహం దాగుందనే ప్రచారం పెరిగిపోయింది. దాంతో అనవసరంగా వివాదాల్లో ఇరుక్కోవటం ఎందుకని  చాలామంది స్టార్లు హాజరుకాలేదు. దాంతో శతజయంతి ఉత్సవం కాస్త టీడీపీ ఉత్సవమైపోయింది. సీపీఎం నుండి సీతారామ్ ఏచూరి, గవర్నర్ బండారు దత్తాత్రేయ లాంటి కొంతమంది మాత్రమే హాజరయ్యారు. ఎక్కువమంది చంద్రబాబు మద్దతుదారులే కనిపించారు.ఇక ఖమ్మంలో ఈనెల 28వ తేదీన ఎన్టీయార్ విగ్రహావిష్కరణ పెట్టుకున్నారు. శ్రీకృష్ణుడి రూపంలో 54 అడుగుల ఎన్టీయార్ విగ్రహాన్ని లక్కారం ట్యాంక్ బండ్ మీద ఏర్పాటుచేశారు. ఇదికూడా రాజకీయంగా బాగా వివాదాస్పదమైపోయి చివరకు కోర్టులో ఇరుక్కుంది. విగ్రహావిష్కరణకు చీఫ్ గెస్ట్ జూనియర్ కార్యక్రమానికి హాజరయ్యేది అనుమానంగా తయారైంది. మొత్తానికి శతజయంతి ఉత్సవాలను చంద్రబాబు ఏ ఉద్దేశ్యంతో నిర్వహించాలని అనుకున్నారో కానీ చివరకు పిలిచిన స్టార్లలో చాలామంది దూరంగా ఉండటంతో  కార్యక్రమం చిన్నబోయింది. మరి 28వ తేదీ లక్కారం ట్యాంక్ బండ్ కార్యక్రమం ఎలా జరుగుతుందో చూడాల్సిందే.
మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: