అమరావతి : అవినాష్ ను ఎల్లోమీడియా వెంటాడుతోందా ?

Vijaya
ఎల్లోమీడియా వ్యవహారం చాలా విచిత్రంగా తయారవుతోంది. తమకు గిట్టని వ్యక్తులను నిలువునా బురదలో ముంచేసేంత వరకు విశ్రాంతి తీసుకునేట్లు లేదు. విషయం ఏదైనా వెంటాడి వేటాడి వేధించటమే పనిగా పెట్టుకున్నట్లుంది. తాజాగా జరిగిన వ్యవహారమే దీనికి ఉదాహరణ. శుక్రవారం హైదరాబాద్ లో సీబీఐ విచారణకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి హాజరుకావాల్సుంది. అయితే హాజరుకాలేదు. కారణం ఏమిటంటే వాళ్ళ అమ్మకు తీవ్ర అనారోగ్యం. విచారణకు హాజరవ్వటం హాజరుకాకపోవటం అన్నది అవినాష్-సీబీఐ మధ్య వ్యవహారం.ఇందులో ఎల్లోమీడియాకు ఎలాంటి ప్రమేయంలేదు. అయితే సీబీఐ విచారణకు అవినాష్ ఎందుకు హాజరుకాలేదంటు నానా రచ్చచేసింది. అవినాష్ ప్రయాణిస్తున్న వాహనాన్ని విడవకుండా వెంటాడింది. యూరోపు దేశాల్లోని మీడియాలో ఇలాంటి పద్దతిని పేపరాజి అంటారు. తమ టార్గెట్ ను ఒక సెక్షన్ ఆఫ్ మీడియా తెగించి ఎంతకైనా సరే వెంటాడుతుంది. సదరు మీడియాకు ప్రముఖులు, సెలబ్రిటీల జీవితాల్లో బొక్కలు వెతకటమే ముఖ్యమైన పని. ఇలా జరిగినపుడే బ్రిటన్ కు చెందిన డయానా  చనిపోయింది.అచ్చంగా అదే పద్దతిలో ఎల్లోమీడియా అవినాష్ వాహనాన్ని వెంటాడింది. తన తల్లి అనారోగ్యంతో ఎంపీ అవస్తలు పడుతుంటే ఎల్లోమీడియాకు చెలగాటమైపోయింది. ఎంపీ విచారణకు ఎందుకు రాలేదు ? గైర్హాజరైనా  సీబీఐ ఏమిచేస్తోంది ? అంటు రెచ్చిపోయింది. ఇక్కడ ఎల్లోమీడియా బాధ ఏమింటే ఇంకా అవినాష్ ను సీబీఐ ఎందుకు అరెస్టుచేయలేదు అని.చాలాకాలంగా అవినాష్ ను సీబీఐ అరెస్టుచేస్తుందని వార్తలు, కథనాలు ఇచ్చుకుంటోంది. అవినాష్ అరెస్టు ఎల్లోమీడియాలో జరుగుతోందే కానీ సీబీఐ మాత్రం ఆ దిశగా అడుగులు వేయటంలేదు. అదే ఎల్లోమీడియాకు బాగా మంటగా ఉన్నట్లుంది. వివేకానందరెడ్డి హత్యలో అవినాషే సూత్రదారుడని, కీలక పాత్రదారుడిగా ఎల్లోమీడియా ఎప్పుడో డిసైడ్ చేసేసింది. తాము డిసైడ్ చేసినా సీబీఐ ఇంకా అరెస్టుచేయకుండా ఉపేక్షించటాన్నే ఎల్లోమీడియా తట్టుకోలేకపోతోంది. ఆ మంటతోనే వివేకా హత్యకేసును సీబీఐతో పాటు ఎల్లోమీడియా కూడా ప్యారలల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తోంది. మరీ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు పూర్తవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: