అమరావతి : టీడీపీ దెబ్బకే గ్లాసు ఎగిరిపోయిందా ?

Vijaya


పొత్తుల మాయలో పడి తెలుగుదేశంపార్టీతో అంటకాగిన ఫలితంగా జనసేనకు ఎన్నికల గుర్తు ఎగిరిపోయింది. జనసేన ఎన్నికల గుర్తు గాజుగ్లాసు ఫ్రీ సింబలైపోయింది. జనసేనకు మాత్రమే గాజుగ్లాసును ఎన్నికల గుర్తుగా కేటాయించాలని అధినేత పవన్ కల్యాణ్ ఎంత రిక్వెస్టుచేసుకున్నా సాధ్యంకాలేదు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో అవసరమైన ఓట్లు లేదా సీట్లు తెచ్చుకోని కారణంగా గాజుగ్లాసు గుర్తును పార్టీకి కేటాయించలేమని కేంద్ర ఎన్నికల కమీషన్ స్పష్టంగా చెప్పేసింది.కమీషన్ నిబంధనల ప్రకారం జనసేనకు గాజుగ్లాసు దక్కాలంటే మొత్తంమీద 7 శాతం ఓట్లుకానీ లేదా కనీసం 2 అసెంబ్లీ సీట్లలో కానీ గెలిచుండాలి. అయితే జనసేనకు 2019 ఎన్నికల్లో వచ్చింది 5.53 శాతం ఓట్లు మాత్రమే. గెలిచింది కూడా ఒకే ఒక్క సీటు. దాంతో గుర్తు పార్టీకి దక్కలేదు. ఆ తర్వాత మూడు ఉపఎన్నికలు జరిగాయి. అలాగే స్ధానిక సంస్ధల ఎన్నికలు కూడా జరిగాయి. అయితే మూడు ఉపఎన్నికల్లోను జనసేన పోటీచేయలేదు. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా అన్నీచోట్లా జనసేన పోటీచేయలేదు.ఈమధ్యనే జరిగిన ఎంఎల్సీ ఎన్నికల్లో కూడా పోటీకి దిగలేదు. తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని పవన్ తాను పోటీచేయకుండా మిత్రపక్షం బీజేపీకి అవకాశమిచ్చారు. వైసీపీ, టీడీపీ, జనసేన మూడుపార్టీలు పోటీచేస్తే ఓట్లుచీలిపోయి వైసీపీ ఈజీగా గెలుస్తుందని పవన్ అనుకున్నారు. అందుకనే పోటీలో తాను కాకుండా బీజేపీకి అవకాశమిచ్చారు. అయితే ఉపఎన్నికల్లో వైసీపీని మంచి మెజారిటితో గెలిచింది. ఇక బద్వేల్, ఆత్మకూర్ ఉపఎన్నికల్లో వైసీపీతో పోటీపడలేక త్యాగంచేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చి బీజేపీనే పోటీచేయమన్నారు. గ్లాసును కాపాడకోవటాన్ని వదిలేసి టీడీపీ కోసమే పవన్ పనిచేశారు.ఇక లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీ గెలుపుకోసం జనసేన చాలా తక్కువ స్ధానాల్లో మాత్రమే పోటీచేసింది. కాబట్టి ఇక్కడా ఓట్లురాలేదు. పోనీ ఎంఎల్సీ ఎన్నికల్లో అయినా పోటీచేసిందా అంటే చేయలేదు. అంటే అవకాశం వచ్చిన ప్రతిసారి టీడీపీ కోసమనే జనసేనను పవన్ పోటీలో దింపలేదు. దీని ఫలితంగా ఏమైందంటే ఇపుడు జనసేనకు ఎన్నికలగుర్తు గాజుగ్లాసు ఎగిరిపోయింది. 2024 ఎన్నికల్లో కూడా గాజుగ్లాసు దక్కుతుందని నమ్మకంలేదు. అంటే ఇక ఎప్పటికీ గాజుగ్లాసు గుర్తు జనసేనకు దక్కే అవకాశం లేదని అర్ధమైపోతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: