అమరావతి : తప్పంతా జనాలదే అంటున్న చంద్రబాబు

Vijaya


ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుకు ఇంకా జ్ఞానోదయం అయినట్లు లేదు. ఎందుకంటే టీడీపీ ఓటమికి కారణం ఇపుడు కూడా జనాలే అంటున్నారు. తన విజన్ 2020 అర్ధంకాకే జనాలు టీడీపీని ఓడించారని చెప్పారు. తన విజన్ వల్లే హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందినట్లు ప్రకటించారు. తన విజన్ లేకపోతే హైదరాబాద్ కు ఇఫుడీస్ధాయి ఉండేదే కాదన్నట్లుగా మాట్లాడారు. గీతం యూనివర్సిటి గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతు తానుచేసిన కృషి వల్లే డెవలప్మెంట్లో  హైదరాబాద్ ఈ స్ధాయికి చేరుకుందన్నారు.అంతేకానీ తన పరిపాలనలో లోపాల వల్ల టీడీపీ ఓడిపోయిందని ఇప్పుడు కూడా చంద్రబాబు అంగీకరించటంలేదు. అప్పట్లో విజన్ 2020ని పెట్టుకుని ఎన్నికల్లో ఓడిపోయినా ఇపుడు విజన్ 2047 పెట్టుకునట్లు చెప్పారు. తాను రెగ్యులర్ గా ఏదో ఒక విజన్ పెట్టుకునే పనిచేస్తానని, ఏ విజన్ పెట్టుకోకుండా పనిచేయటం వల్ల డెవలప్మెంట్ సాధ్యంకాదన్నారు. యువత కూడా ఏదో ఒక డెవలప్మెంట్ ను లక్ష్యంగా పెట్టుకుని పనిచేయకపోతే భవిష్యత్తు ఎలాగ ఉంటుందని ప్రశ్నించారు.చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా పార్టీని గాలికొదిలేస్తారనే విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నపుడు ఎంతసేపు ఉన్నతాధికారులను చుట్టూ పెట్టుకుంటారు. తర్వాత ఎన్నికల్లో ఓడిపోగానే పార్టీని నిర్లక్ష్యం చేసిన కారణంగానే ఓడిపోయానని చెప్పుకుంటారు. చంద్రబాబుకు ఇది బాగా అలవాటైపోయింది. తాను అధికారంలో కంటిన్యు అవ్వటంలోనే  ఒక విజన్ లేనివ్యక్తి  ఇక రాష్ట్రానికి ఏమి విజన్ ఇవ్వగలరు ?మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అంత ఘోరంగా ఓడిపోవటానికి తన పాలనలోని వైఫల్యాలే అని ఇప్పటికీ చంద్రబాబు అంగీకరించటంలేదు. తన పరిపాలన బ్రహ్మాండమని, జగన్మోహన్ రెడ్డి జనాలను మోసంచేసి ఓట్లేయించుకున్నారని తన ఓటమిని సమర్ధించుకుంటున్నారు. పైగా వైసీపీని గెలిపించినందుకు జనాలను శాపనార్ధాలు పెడుతున్నారు. తన ఓటమి విషయంలో క్లారిటిలేని, నిజాయితీగా విశ్లేషించుకునే విజన్ లేని చంద్రబాబు విజన్ 2020 అని విజన్ 2047 అని ఊదరగొడుతున్నారు. మొత్తానికి చంద్రబాబు ఎప్పుడు ఓడిపోయినా జనాలదే తప్పని గట్టిగా ఫిక్సయిపోయినట్లున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: