రాయలసీమ : కడపలో సీబీఐ క్యాంపు..పెరిగిపోతున్న టెన్షన్

Vijayaవివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ-కడప ఎంపీ అవినాష్ రెడ్డి మధ్య వ్యవహారం టామ్ అండ్ జెర్రీ కార్టూన్ షో లాగ తయారైంది. అవినాష్ ను అరెస్టు చేయాలని సీబీఐ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఎలాగైనా అరెస్టునుండి తప్పించుకోవాలని అవినాష్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ముందస్తు బెయిల్ పిటీషన్ వేశారు. పిటీషన్ వేయగానే వివేకా కూతురు సునీత అభ్యంతరాలు చెబుతు మరో పిటీషన్ వేశారు. ఇదే సమయంలో ఎంపీకి బెయిల్ ఇవ్వద్దని సీబీఐ కేసు వేసింది.సరే ముందస్తు బెయిల్ రావటం తర్వాత దాన్ని చాలెంజ్ చేస్తు సునీత, సీబీఐ సుప్రింకోర్టులో పిటీషన్ వేయటం తెలిసిందే. చివరకు బెయిల్ రద్దయ్యింది. అవినాష్ బెయిల్ విషయమై హైకోర్టే నిర్ణయం తీసుకోనుంది. అంటే ఎంపీని సీబీఐ ఎప్పుడైనా అరెస్టు చేయచ్చు. అయితే ఎందుకనో ఎంపీని అరెస్టుచేయకుండా ఆయన చుట్టూనే తిరుగుతోంది. ఇపుడు కడపలో సీబీఐ ఉన్నతాధికారులు క్యాంపేశారు.  అవినాష్ ను అరెస్టు చేయకుండా ఎందుకని క్యాంపు వేశారో అర్ధంకావటంలేదు.బెయిల్ పిటీషన్ విచారణలో ఉండగానే కడపలో ఎంపీ ఇంట్లో సీబీఐ సోదాలు చేసింది. మరి ఏమి దొరికిందో మాత్రం తెలీలేదు. తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయిన సీబీఐ అధికారులు మళ్ళీ శనివారం సాయంత్రానికి కడపకు చేరుకున్నారు. ఆదివారం నాడు పులివెందులలో ఎంపీ గడపగడపకు వైసీపీ అనే కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. సీబీఐ వ్యవహారం ఎలాగుందంటే అవినాష్ పై ఫుల్లుగా మైండ్ గేమ్ ఆడుతున్నట్లే ఉంది.కడపలో సీబీఐ ఎందుకు క్యాంపు వేసిందో తెలీదు. అంతకుముందు పులివెందులలో ఎందుకు పర్యటించిందో అర్ధంకావటంలేదు.  ఎంపీ ఇంట్లో ఏమి దొరుకుతుందని సోదాలు చేసిందో అర్ధంకాలేదు. సోదాల్లో ఏమి దొరికిందో కూడా సీబీఐ చెప్పలేదు, అవినాష్ ను అడగలేదు. ఇదంతా చూస్తుంటే కావాలనే ఎంపీలో టెన్షన్ పెంచేయటంలో భాగమే అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. బెయిల్ రద్దయిన కారణంగా సీబీఐ ఎప్పుడైనా ఎంపీని అరెస్టు చేయచ్చు. కానీ అరెస్టుచేయకుండా ఈరోజు అరెస్టు చేస్తుంది..రేపు అరెస్టుచేయచ్చనే ప్రచారానికి తెరలేపింది. మరి ఆదివారం ఏమిచేస్తుందో చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: