అమరావతి : వివేకా హత్యకేసులో బిగ్ ట్విస్ట్

Vijaya



వివేకానందరెడ్డి హత్యకేసులో ఊహించని ట్విస్టు చోటుచేసుకుంది. వివేకా రెండోభార్యగా ప్రచారంలో ఉన్న షమీమ్ సీబీఐ ముందుకొచ్చారు. తన భర్త మర్డర్ కు సంబంధించిన కారణాలను షమీమ్ సీబీఐకి స్టేట్మెంట్ ఇచ్చారు. నాలుగు పేజీల స్టేట్మెంట్ లో వివేకాను ఆయన కూతురు డాక్టర్ సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన సోదరుడు నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి పెట్టిన బాధలన్నింటినీ వివరించారు.



తన భర్త చనిపోయేముందు కూతురు, అల్లుడు, అల్లుడి సోదరుడు ఏ రకమైన బాధలకు గురిచేశారో పూసగుచ్చినట్లు వివరించారు. జేబులో డబ్బులు లేకుండా చేశారట. చెక్ పవర్ రద్దుచేశారట. నెలకింత అని ఖర్చులకు ఇచ్చేవారట. ఆయన సంసాదించిన ఆస్తులన్నింటినీ కూతురు, అల్లుడు లాగేసుకున్నట్లు షమీమ్ ఆరోపించారు. కొన్ని ఆస్తులను తనపేరు మీద పెడదామని వివేకా అనుకుంటే వాటిని కూడా బలవంతంగా కూతురు, అల్లుడు లాగేసకున్నట్లు మండిపడ్డారు.



బెంగుళూరుకు సంబంధించిన ఒక సెటిల్మెంట్ లో డబ్బులు వస్తాయని అందులో నుండి రు. 8 కోట్లు ఇస్తానని వివేకా తనతో చెప్పినట్లుగా షమీమ్ వివరించారు. వివేకా ఆస్తులపై అల్లుడు, ఆయన పదవిపై అల్లుడి సోదరుడు శివప్రకాష్ రెడ్డి కన్నేసినట్లు చెప్పారు. డైరెక్టుగా చెప్పలేదు కానీ షమీమ్ చెప్పింది చూసిన తర్వాత వివేకా హత్యకు కూతురు, అల్లుడు, అల్లుడి సోదరుడే కారణమన్నట్లుగా చెప్పారు.



ఇదే విషయాన్ని కడప ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి ఎప్పటినుండో చెబుతున్నారు. హత్యకేసులో తమను ఇరికించేందుకే సీబీఐ ప్రయత్నాలు చేస్తోంది కానీ తాము చెప్పిన విషయాలపై సీబీఐ ఎప్పుడూ దర్యాప్తు చేయలేదని అవినాష్ చాలాసార్లు మొత్తుకున్నారు. వివేకా హత్యకు కుటుంబ కలహాలతో పాటు ఆస్తి తగాదాలు కూడా కారణమని ఎంపీతో పాటు ఆయన తండ్రి భాస్కరరెడ్డి నెత్తి నోరు మొత్తుకుంటున్నా సీబీఐతో పాటు కోర్టులు కూడా ఇంతకాలం పట్టించుకోలేదు. ఇప్పుడిప్పుడే కోర్టులు ఎంపీ ఆరోపణలపై దృష్టిపెట్టింది. ఈ నేపధ్యంలోనే సీబీఐని కలిసి షమీమ్ స్టేట్మెంట్ ఇవ్వటం ఎంపీ ఆరోపణలకు మద్దతుగా నిలబడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: