రాయలసీమ : పాపం అఖిల ఇలాగైపోయిందా ?

Vijayaమాజీమంత్రి భూమా అఖిలప్రియ తెలుగుదేశంపార్టీలో ఒంటరైపోయారు. నియోజకవర్గంలో ఆమె ఎక్కడ పర్యటించినా పట్టుమని పదిమంది మద్దతుదారులు కూడా కనబడటంలేదు. నియోజకవర్గంలో పార్టీ సమావేశం పెడితే హజరవటానికి చాలామంది ఇష్టపడటంలేదని సమాచారం. ఇదంతా ఎందుకంటే ఆళ్ళగడ్డలోని చాగలమర్రి బస్టాండ్ ప్రాంతంలో ఇదేం ఖర్మ..రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల వెంట పదిమంది కూడా లేరు. పోనీ జనాలన్నా కనిపించారా అంటే వాళ్ళూ లేరు.ప్రతిరోజు ఏదోక వివాదంలో ఉంటున్న అఖిల వెంట నడవటానికి పార్టీలోని నేతలెవరూ ఇష్టపడటంలేదు. పైగా వచ్చేఎన్నికల్లో అఖిలకు ఆళ్ళగడ్డలో టికెట్ దక్కదనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. చంద్రబాబునాయుడు, లోకేష్ ఇద్దరిలో ఎవరూ మాజీమంత్రిని ఎంటరటైన్ చేయటంలేదు. ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నించినా అవకాశం ఇవ్వటంలేదని తమ్ముళ్ళు చెబుతున్నారు. దాంతో ఏమిచేయాలో దిక్కుతోచక ఈమెలో టెన్షన్ పెరిగిపోతోంది.ఆళ్ళగడ్డలో టికెట్ దక్కదనే అనుమానం వచ్చినట్లుంది అందుకనే నంద్యాల మీద ఫోకస్ పెట్టారు. నంద్యాలలో పార్టీ ఆఫీసుకు అఖిల వెళ్ళితే ఆఫీసులో ఉన్న వాళ్ళంతా బయటకు వెళ్ళిపోతున్నారట. సీనియర్ నేతల మీటింగులకు మాజీమంత్రిని పిలవటంలేదు. ఆఫీసుకు వెళ్ళినపుడు సీనియర్లున్నా ఎవరూ మాట్లాడటంలేదు. నంద్యాల నియోజకవర్గంలో జోక్యం చేసుకోవద్దని ఒకపుడు చంద్రబాబు చెప్పినా అఖిల వినిపించుకోలేదట. అందుకనే పార్టీ ఆఫీసుకు వెళితే అవమానమే తప్ప లాభంలేదని అర్ధమైపోయి తానే సొంతంగా ఆఫీసు పెట్టుకున్నారు.ఇటు ఆళ్ళగడ్డలోను అటు నంద్యాలలో కూడా ఎవరూ మాజీమంత్రిని పట్టించుకోవటంలేదు. దాంతో పార్టీలో ఒంటరైపోయారన్నది అర్ధమైపోతోంది. ఈ పరిస్ధితుల్లో టికెట్ దక్కేది అనుమానమే. ఒకవేళ ఏదో పద్దతిలో టికెట్ దక్కించుకున్నా గెలవటం ఎలా ? అన్నదే సమస్య అయిపోయింది. ఎందుకంటే నేతల్లో చాలామందితో అఖిలకు సంబంధాలు లేవు. కారణం ఏమిటంటే భర్త భార్గవే అంటున్నారు. భూకబ్జాలు, సెటిట్మెంట్లు, కిడ్నాపులు, హత్యాప్రయత్నాల్లాంటి వాటిల్లో భార్గవ్ పేరే వినబడుతోందట. కిడ్నాపు కేసులో అఖిల కూడా జైలుకు వెళ్ళి బెయిల్ పై బయటతిరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి అనేక కారణాలతో పాటు నోటిదురుసు కూడా చాలా ఎక్కువని పార్టీలోనే చెప్పుకుంటారు. కాబట్టి ఇపుడు అఖిల పార్టీలో ఎవరికీ కాకుండా ఒంటరైపోయారట. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: